పసిపిల్లలు రాత్రుళ్లు ఎందుకు ఎక్కువగా ఏడుస్తారు..?

-

Babies cry: పసిపిల్లలు పగలంతా బానే ఉంటారు.. రాత్రయ్యే సరికి ఏడుస్తారు.. పగలు ఏడ్చినదానికంటే.. రాత్రి వీళ్లు డబుల్‌ ఏడుస్తారు. ఎంత సముదాయించినా వినరు. గుక్కపట్టి మరీ ఏడుస్తారు.. పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో పేరంట్స్‌కు అస్సలు సరైన నిద్ర ఉండదని అధ్యయనాలే చెప్పాయి. మరి చైల్డ్ సైకాలజీ నిపుణులు దీనిపై ఏమంటున్నారంటే..

 

Babies cry
Babies cry

పిల్లలు ఏడవడానికి కొన్నిరకాల భావాలుంటాయట. చిన్నపిల్లలు అలసట కారణంగానే రాత్రిళ్లు నిద్రపోకుండా ఏడుస్తారని నిపుణులు అంటున్నారు. అలాగే రాత్రి సమయంలో పిల్లలకు ఎక్కువగా ఆకలి వేస్తుందంట. అందుకే రాత్రిళ్లు పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు. కొంతమంది పిల్లలు ఉదయం పూట ఎక్కువగా నిద్రపోయి రాత్రిళ్లు అస్సలు నిద్రపోకుండా ఏడుస్తారు. మరికొందరు రాత్రి పూట ఎక్కువగా నిద్రపోయి ఉదయం నిద్రపోకుండా ఆడుకుంటారు.
అలాగే పిల్లలకు కడుపులో గ్యాస్ లేదా ఇతర ఇబ్బందుల వల్ల కూడా ఏడుస్తారట. సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు గంటల తరబడి కూడా పిల్లలు ఏడుస్తారని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు రాత్రుళ్లు ఎక్కువగా ఏడుస్తున్నారంటే.. ముందు రూమ్‌ ఎలా ఉందో గమనించాలి.. ఎక్కువగా ఉక్కగా ఉంటే పిల్లలకు ఊపిరి ఆడక ఏడుస్తారు.. అలాగే పిల్లలకు ఎలాంటి బట్టలు వేసారు అన్నది కూడా ముఖ్యమే.. బాగా గుచ్చుకునే దుస్తులు ఉన్నట్లైతే వెంటనే మార్చేయాలి. అలాగే ఇంట్లో అధిక శబ్ధాలు లాంటివి ఉన్నా పిల్లలు కంగారుపడతారు.. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లు ప్రశాంతంగా ఉండాలి.. ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం ఉంటే వాళ్ల మనసు కూడా అలానే ఆగం ఆగం ఉంటుంది.

చిన్న పిల్లలు ఏడ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా..?

బాగా ఏడ్చినప్పుడు శిశువు కడుపు గాలితో నిండి ఉబ్బుతుంది. ఈ మార్పు ఏడ్పు వల్ల వచ్చేదే గానీ, ఏడ్పునకు కారణం కాదు. పాలు తాగుతున్నప్పుడు కూడా కొందరు పిల్లలు ఏడుస్తుంటారు. దీనికి కారణం, రొమ్ముతో ముక్కు మూసుకుపోవడం, రొమ్ము మొన నోటికి సరిగా అందకపోవడం. కాబట్టి, పాలు తాగించే ముందు తల్లి సరిగా కూర్చొని, శిశువును రొమ్ము దగ్గరికి ఉండే విధంగా హత్తుకొని, ముక్కు మూసుకొని పోకుండా చూపుడు వేలు, మధ్య వేలుతో పట్టుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news