బాంటియా బంపర్‌ ఆఫర్‌ : ఫర్నీచర్ కొంటే.. ప్లాట్ ఫ్రీ..!

-

ఈరోజుల్లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని సంస్థలు భలే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మనం కొనే సొమ్ములో కొంత మొత్తం వెనక్కు వచ్చేలా ఈ ఆఫర్లు ఉంటున్నాయి. వీటికి అలవాటుపడిన జనం కోసం ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఏమైనా ఆఫర్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటున్నారు. ఆఫర్లు పెట్టేవరకూ వెయిట్ చేస్తున్నారు.

అయితే హైదరాబాద్‌, సికింద్రాబాద్ ల్లోని బాంటియా ఫర్నిచర్ సంస్థ మాత్రం దిమ్మతిరిగే ఆఫర్లు ప్రకటించింది. ఈ సంస్థలో రూ. 5 లక్షల విలువైన ఫర్నిచర్ కొంటే ఏకంగా ఓ సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంటే గిఫ్టుగా ఇస్తామని ప్రకటించింది. ఎలాగూ ఐదు ల‌క్షల విలువైన ఫర్నీచర్ ఇస్తారు.. దీనికి అదనంగా ఈ ఫ్లాట్ గిఫ్టు అన్నమాట.

అంతే కాదు.. రూ. 4 లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ కొంటే.. 100గజాల ప్లాటు ఫ్రీగా ఇస్తారట. అంతేనా.. మూడు లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ కొన్నవారికి మారుతి ఆల్టో కారు బహుమతిగా ఇస్తారట. లక్ష రూపాయల ఫర్నీచర్ కొన్నవారికి హోండా యాక్టివా 5జీ బహుమతిగా ఇస్తారట.

ఈ ఆఫర్లు చూసి ఇదేదో లక్కీ లాటరీ తగిన వారికే అనుకునేరు సుమా..అలాంటిదేమీ కాదట.. ప్రతి ఒక్కరికీ గిఫ్ట్ తప్పకుండా ఉంటుందని ఢంకా భజాయించి చెబుతోందీ బాంటియా సంస్థ.

అంతే కాదు ఈ మొత్తం ఒక్కసారే కట్టాల్సిన అవసరం కూడా లేదు. 36 ఈ ఎం ఐల్లో కట్టొచ్చట. ఇంకో విశేషం ఏంటంటే.. ఎలాంటి డాక్యుమెంట్లూ అవసరం లేకుండానే వాళ్లే లోను కూడా ఇప్పిస్తారట. ఇదేదో బావుంది కదూ..

నమ్మశక్యంగా లేదు కదూ.. ఈ ఆఫర్ త్వరలోనే ముగిసిపోతుందని త్వరపడండని సదరు బాంటియా సంస్థ ఊరిస్తోంది. ఎవరైనా కారు కొనాలనుకున్నా, బండి కొనాలనుకున్న బాంటియాకు వెళ్తే సరే..అదే మొత్తంలో ఫర్నీచర్ కూడా ఉచితంగా తెచ్చుకోవచ్చు. మరిన్ని వివరాలకోసం సికింద్రబాద్ లోని ఆ సంస్థ ను సంప్రదించొచ్చు. ఫోన్ నెం. 040- 27841562

 

Read more RELATED
Recommended to you

Latest news