2050 నాటికి ప్రపంచంలో 80 కోట్ల మందికి నడుమునొప్పి వచ్చే అవకాశం ఉందట..!!

-

ఉద్యోగాలు చేసేవాళ్లకు శాలరీకు కరెక్టుగా వస్తాయో లేదో కానీ.. ఈ వెన్ను నొప్పి మాత్రం కచ్చితంగా వస్తుంది. వెన్నునొప్పితో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. కూర్చుంటే నడుము నొప్పి అని చెప్పే వారు ఎంతోమంది ఉన్నారు.. 2017తో పోలిస్తే 2020లో నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య చాలా పెరిగినట్టు కొత్త అధ్యయనం చెబుతోంది.. లాన్సెట్ రుమటాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 2050 నాటికి వెన్ను నొప్పితో బాధపడే వారి సంఖ్య 80 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే 2020తో పోలిస్తే 2050 నాటికి 36% పెరుగుతుంది. 2020లో 60 కోట్ల మంది ఇలా నడుము నొప్పి బారిన పడినట్టు అధ్యయనం చెబుతోంది.

నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య ఆసియాలోనే ఎక్కువగా ఉందని ఆ తర్వాత ఆఫ్రికాలో నమోదు అవుతున్నాయని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. నడుము నొప్పిని చాలామంది తేలికగా తీసుకుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందిలే, ఏదో ఒక మసాజ్‌ చేసుకుంటే పోతుందిలే అని లైట్‌ తీసుకుంటారు.. ప్రపంచంలో ఎన్నో అనారోగ్యాలకు నడుమునొప్పి ప్రధాన కారణం. ఈ నడుము నొప్పి వల్ల మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక అనారోగ్యాలు వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. అపారమైన ఒత్తిడి వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. నడుము నొప్పి వస్తున్నప్పుడు దాని తేలిగ్గా తీసుకోకూడదు. అది ఇతర ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతుంది.

ధూమపానం, అధిక బరువు కారణంగా నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతుంది. మగవారితో పోలిస్తే ఆడవారిలోనే నడుము నొప్పి కేసులు ఎక్కువగా ఉన్నాయట.. పని చేస్తే నడుమునొప్పి వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. వృద్ధుల్లో ఎక్కువగా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది.

సాధారణ నడుము నొప్పి అయితే అయితే ప్రమాదం లేదు. కానీ కొన్ని రకాల కారణాల వల్ల నడుము నొప్పి వస్తుంది. అలాంటప్పుడు వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. నడమునొప్పితో పాటూ జ్వరం వస్తే తేలికగా తీసుకోకూడదు. అలాగే ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కాళ్లు బలహీనంగా మారడం, కాళ్లు తిమ్మిర్లు, మూత్రం, మలవిసర్జనలపై పట్టు లేకపోవడం వంటివి నడుము నొప్పితో పాటూ వస్తున్నాయంటే.. మీరు జాగ్రత్త పడాలి.

Read more RELATED
Recommended to you

Latest news