ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా శృంగారం చేయవచ్చా..!!

ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలకు ఎన్నో సందెహాలు వస్తూ వుంటాయి.రోజూ తినే ఆహారం విషయంలో కానీ,వ్యాయామాలు,డైట్ విషయంలో ఎన్నో డౌట్స్ రావడం సహజం..చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు.మరికొన్ని విషయాల్లో స్పష్టత లేక పలు అపోహలూ నిజమని నమ్మే అవకాశమూ లేకపోలేదు. అందులో శృంగారం కూడా ఒకటి.

ఆరోగ్యానికి, అనుబంధానికి కీలకమైన ఈ ప్రక్రియను గర్భం ధరించాక కొనసాగించవచ్చో, లేదో అన్న సందేహం చాలామంది గర్భిణుల్లో తలెత్తడం సహజం. ఇదొక్కటనే కాదు.. ప్రెగ్నెన్సీలో కలయికకు సంబంధించిన మరెన్నో సందేహాలు-అపోహలతో సతమతమవుతుంటారు మరికొందరు. మరి, ఇంతకీ ప్రెగ్నెన్సీలో శృంగారం చేయచ్చా?లేదా? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

గర్భిణీలు శృంగారం లో పాల్గొంటే ఏదైనా సమస్యలు వస్తాయెమో అని ఆలొచిస్తారు.డాక్టర్‌ సలహా మేరకు నిర్భయంగా కలయికలో పాల్గొనచ్చంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియ ఏ రకంగానూ బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపదని చెబుతున్నారు. అయితే ఇక్కడ గర్భిణి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లడం మాత్రం తప్పనిసరి. అలాగే పొట్టపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమూ ముఖ్యమే..

అయితే భాగస్వామిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేనంత వరకు ప్రెగ్నెన్సీలో కలయిక సురక్షితమే అంటున్నారు నిపుణులు. అదే ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే మాత్రం వాళ్లను పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమం అంటున్నారు. అయితే ఇలాంటప్పుడు కొంతమంది కండోమ్స్‌ వంటి సురక్షిత పద్ధతులు పాటిస్తుంటారు. కానీ ఆ రిస్క్‌ కూడా చేయకపోవడమే మంచిదట..గర్భంతో ఉన్న మహిళలు శృంగారంలో పాల్గొంటే ఎటువంటి ప్రయొజనాలు ఉన్నాయో ఇపుడు చుద్దాము..

* గర్భిణిగా ఉన్న సమయంలో ఫిట్‌గా, చురుగ్గా ఉండడానికీ శృంగారం తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. శరీరంలో పేరుకుపోయే అదనపు కొవ్వులు, క్యాలరీలు కరగడమే ఇందుకు కారణం.

* శృంగార ప్రక్రియ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి గర్భిణిగా ఉన్న సమయంలో ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీ సౌకర్యం, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కలయికలో పాల్గొనడం మంచిది.
* లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్లు. తద్వారా తల్లీబిడ్డలిద్దరూ రిలాక్సవ్వచ్చు.
* ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుభందం తగ్గకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు…