ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

-

Childhood video of Vijay Deverakonda goes viral

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని చూశారా? అరె.. ఈ బుడ్డోడు.. అరె.. ఎవరబ్బా… ఎక్కడో చూసినట్టుందే.. కానీ.. గుర్తుకు రావట్లేదే? నోట్లోనే ఉంది కానీ.. పేరు గుర్తొస్తలేదే? అంటారా? కాస్త మీ బుర్రకు పదును పెట్టండి. ఈ బుడ్డోడు ఇప్పుడు బుడ్డోడు కాదు.. టాలీవుడ్ లో స్టార్ హీరో. అవును.. ఇప్పటికైనా గుర్తొచ్చాడా? గుర్తు రాకపోతే.. ఓసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

చూశారుగా.. ఇప్పటికైనా అర్థమయి ఉంటుంది. ఆ పిల్లోడు ఎవరో కాదు. విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో సెన్సేషన్ స్టార్ అయిపోయాడు. అయితే.. విజయ్.. చిన్నప్పుడే సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. 1999 లో ఓ టీవీ సీరియల్ లో నటించాడు విజయ్. షావుకారు జానకితో కలిసి ఆయన సీరియల్ నటించిన వీడియోనే మీరు పైన చూసింది. ఆ వీడియోను విజయ్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో.. ఆ ట్వీట్ ను రిట్వీట్ చేసి.. ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపాడు విజయ్.

Read more RELATED
Recommended to you

Latest news