బాత్రూం టైల్స్ ని ఇలా క్లీన్ చేసేయండి.. తెల్లగా వచ్చేస్తాయి..!

-

చాలా మంది బాత్రూం ని క్లీన్ చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు బాత్రూం ని క్లీన్ చేయడానికి చాలా కష్ట పడుతూ ఉంటారు. బాత్రూం ని మీరు క్లీన్ చేసేటప్పుడు ఇలా చేశారంటే బాత్రూం టైల్స్ మీద ఉండే మురికి మొండి మరకలు అన్నీ కూడా పోతాయి బాత్రూం టైల్స్ తెల్లగా వచ్చేస్తాయి. బాత్రూంలో ఎక్కువ సేపు ఉంటాం కనుక వ్యాధులు వంటివి సంభవించే అవకాశం ఉంది అలా వ్యాధులు వంటివి కలగకూడదు అంటే బాత్రూమ్ ని కూడా బాగా శుభ్రంగా ఉంచుకోవాలి.

క్రిములు వంటివి లేకుండా ఎప్పటికప్పుడు బాత్రూంలో క్లీన్ చేసుకోవాలి. బాత్రూం క్లీన్ చేసేటప్పుడు టైల్స్ ని ఇలా చేశారంటే పేరుకుపోయిన మురికి వంటివి తొలగిపోతాయి. మొండి మరకలు వంటివి కూడా సులభంగా పోతాయి. ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల బేకింగ్ సోడా వేసుకోండి. రెండు స్పూన్లు డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి.

దీనిని బాగా మిక్స్ చేసి మరకలు వంటివి ఉన్నచోట హార్పిక్ వేసి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి బ్రష్ సహాయంతో రుద్దాలి ఇలా చేస్తే శుభ్రంగా తెల్లగా వచ్చేస్తాయి. బాత్రూం టైల్స్ ని మీరు మొదట యాసిడ్ కలిగిన లిక్విడ్ వేసి బేకింగ్ సోడా డిటర్జెంట్ పౌడర్ ని వేయడం వలన మురికి అంతా పోతుంది ఇలా ఈజీగా మీరు బాత్రూం టైల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version