భారత్‌ మెట్రోలో క్రేజీ ఫోటోలు.. ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజన్స్‌ అద్భుతం..!!

-

భారత్‌ మెట్రో: ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజిన్స్‌ రూపొందించే ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూస్తే.. అవి రియల్‌గానే ఉంటున్నాయి..మొన్న 60 ఏళ్ల భామ్మలు రోడ్డుపై స్కేటింగ్‌ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. ‘సాహిద్’ అనే ఆర్టిస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. మెట్రో రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)… రూపొందించిన ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పటికే రెండు భాగాలుగా వాటిని విడుదల చేశాడు. ఇప్పుడు మూడోసారి కూడా రిలీజ్ చేశాడు. ఇవి నిజంగా క్రేజీగా ఉన్నాయి..

ఈ ఫొటోలలో ప్రతి రాష్ట్రంలోని సంప్రదాయం, ఆహారం, సంస్కృతి, అభివృద్ధిని చాలా చక్కగా చూపించారు. ఈ చిత్రాలను చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. AI వివిధ రాష్ట్రాల్లోని మెట్రోరైలు జర్నీని ఎలా తయారుచేసిందో మీరే చూడండి..

కాన్పూర్, కోటా, సూరత్, , చెన్నై, వంటి రాష్ట్రాలు ఈ చిత్రాలలో ఉన్నాయి. ఈ ఫొటోలన్నీ జర్నీలో ఉండగా తీసినట్లు కనిపిస్తాయి. సూరత్ మెట్రోలో ప్రయాణికులను ఇలా చూపించారు. పైన వజ్రాలను AI సృష్టించింది.

హర్యానాలో చాలా మంది వ్యక్తులు తమ సాధారణ వస్త్రధారణలో ఉన్నారు. వారి చేతుల్లో కర్రలతో విలక్షణమైన హర్యాన్వి సంస్కృతిని చూపిస్తున్నారు.

అత్యంత ఆసక్తికరంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని మెట్రో లోపల కూర్చుని ప్రయాణిస్తున్నారు. నిజంగా ఇది హైలెట్‌..

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం ఎక్కువ. అందువల్ల అక్కడి మెట్రోలో ప్రయాణం ఇలా ఉంటుందని AI అంచనా వేసింది.

తమిళనాడులోని కన్యాకుమారిలో సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందువల్ల అక్కడి మహిళలు మెట్రోలో ప్రయాణిస్తే ఇలా ఉంటుందని AI తేల్చేసింది.

ఇక మన హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీకి ఫేమస్.. దేశంలో ఎక్కడా కూడా మన హైదరాబద్‌లో బిర్యానీ ఉన్నంత టేస్టీగా ఉండదు.. ఆ విషయం మనకూ తెలుసు. అందువల్ల హైదరాబాద్ మెట్రోలో బిర్యానీని సెట్ చేసింది AI.

యూపీలో నాటు తుపాకులతో దుండగులు తిరుగుతూ ఉంటారు. అందువల్ల అక్కడి మెట్రోలో ఇలా ఉంటుందని AI క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news