63 ఏళ్ళ పార్లేజీ పాపా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

-

అమ్మా.. ఆకలేస్తోందమ్మా. ఏదైనా ఉంటే పెట్టమ్మా… ఒరేయ్.. నీకెప్పుడూ ఆకలి గోలే. అది కడుపా లేక చెరువా. ఇందా.. ఈ రెండు రూపాయలు తీసుకెళ్లి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినుపో. ఆయ్.. థాంక్యూ మమ్మీ. అంకుల్.. అంకుల్.. రెండు రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరా? ఇదిగో బాబు.. పార్లీజీ బిస్కెట్ ఫ్యాకెట్. హుం.. హుం.. వావ్.. బాగుంది బిస్కెట్.. ఇలా ఈ ఒక్క అబ్బాయే కాదు ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు పార్లీజీ బిస్కెట్ ను. అది కూడా అతి తక్కువ ధరలోనూ బిస్కెట్ ప్యాకెట్ లభించడం.. పిల్లలకు నచ్చే విధంగా బిస్కెట్లను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. అందుకే.. పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ అంటేనే పిల్లలు పడి చచ్చిపోతారు.

సరే.. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. 1929 లో పార్లీజీ బిస్కెట్ కంపెనీని ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ బిస్కెట్లను అమ్ముతున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. అయితే.. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. ఆ చిన్నారి ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ.. ఆ పాప బొమ్మనే బిస్కెట్ ప్యాకెట్ మీద అచ్చేస్తూ వస్తున్నారు. కానీ.. మీకు ఎప్పుడైనా ఆ అమ్మాయి ఎవరు అనే డౌట్ రాలేదా? వచ్చే ఉంటుంది కానీ.. లైట్ తీసుకొని ఉంటారు. ఆ అమ్మాయి పేరు నీరు దేశ్ పాండె. తనకు నాలుగేండ్ల వయసు ఉన్నప్పుడు తన ఫోటోను తీసుకొని పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ మీద వాడుతున్నారు. ఇప్పటికీ అదే అమ్మాయి ఫోటోను వాడుతుండటం విశేషం. నీరు తండ్రి ఆ ఫోటోను తీయగా.. ఆ ఫోటో పార్లీజీ బిస్కెట్ యాజమాన్యానికి నచ్చడంతో వాళ్లు అతడి అనుమతి తీసుకొని అప్పటి నుంచి ఆ అమ్మాయి ఫోటోనే వాడుతున్నారు.

ఇప్పుడు అదే నీరు దేశ్ పాండే వయసు ఎంతో తెలుసా? 63 ఏండ్లు. ఆమె ఇప్పుడు ఎలా మారిందో కింది ఫోటోలో చూడండి. అయితే.. కొంతమంది అసలు ఆ ఫోటోలో ఉన్నది అమ్మాయే కాదు.. కేవలం సృష్టించిన బొమ్మ మాత్రమే అని అంటుంటారు. కానీ.. నిజానికి ఆమె నీరూ దేశ్ పాండే అంటూ చెబుతున్నారు. ఆ అమ్మాయే ఈమె అంటూ నీరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది పార్లీజీ గర్ల్ స్టోరీ.

Read more RELATED
Recommended to you

Latest news