కొవిడ్‌ నుంచి కోలుకున్న 18 నెలల తర్వాత మరణం.? గుబులుపెడుతున్న అధ్యయనం..

కొవిడ్‌ వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగాలు పోయాయి.. కానీ అప్పటికే ఇప్పుడు ఘోరంగా కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నాయి.. నిజానికి అప్పటికంటే పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. దీనికి తోడు మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వేరియంట్ల రూపంలో వైరస్‌లు ఎంట్రీలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో కొవిడ్‌పై జరిగిన ఓ అధ్యయనం షాకింగ్‌ నిజం ఒకటి చెప్పింది.. కోవిడ్ సోకిన తర్వాత కనీసం 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని పరిశోధకులు తాజాగా హెచ్చరిస్తున్నారు.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ప్రచురించిన కార్డియోవాస్కులర్ రీసెర్చ్‌ చేసింది.. ఈ అధ్యయనంలో దాదాపు 1,60,000 మంది పాల్గొన్నారు. కోవిడ్ సోకని వారితో పోలిస్తే కరోనా బారిన పడిన వారిలో అనేక హృదయ సంబంధ పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
దీర్ఘకాలిక కోవిడ్ ఇన్ఫెక్షన్ హృదయ సంబంధ వ్యాధులని ఎక్కువ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కోవిడ్ రోగులని కనీసం ఏడాది పాటు పర్యవేక్షించాలని సూచిస్తున్నారు..వ్యాధి సోకని వ్యక్తులతో పోలిస్తే కోవిడ్ రోగులు మరణించే అవకాశం మొదటి మూడు వారాల్లో 81 రెట్లు అధికంగా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ తీవ్రత 18 నెలల తర్వాత కూడా ఐదు రెట్లు ఎక్కువగా ఉందట..

ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ..

ఈ అధ్యయనం ప్రకారం.. తీవ్రమైన కరోనా వైరస్ బారిన పడిన రోగులు హృదయ సంబంధ వ్యాధులని అభివృద్ధి చేసే అవకాశంతో పాటు కొన్ని తీవ్రమైన కేసుల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది… మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌తో పాటు స్వల్ప, దీర్ఘకాలిక హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ అధ్యయనం కరోనా మొదటి వేవ్ సమయంలో జరిపిందని వాంగ్ అంటున్నారు.. దీని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందట.
ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప వేరియంట్ BF.7 చైనాతో పాటు పలు దేశాలలో విజృంభిస్తోంది. భారత్‌లోనూ ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కానీ ఇప్పటివరకూ.. ఎటువంటి మరణాలు సంభవించలేదు.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ చైనా, జపాన్‌లో ఎక్కువగా ఉంది. అక్కడ మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. మరణాలు సంభవించనప్పటికీ కోవిడ్ ప్రమాదం మాత్రం పోలేదని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు.