ఈ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను పెర్ఫ్యూమ్‌గా వాడుకోవచ్చు తెలుసా..?

పెర్ఫ్యూమ్‌లతో మంచి సువాసన తప్ప మనకు పాజిటివ్‌గా జరిగేది ఇంకే లేదు. కానీ రసాయనాలు ఎక్కువగా ఉన్న పెర్ఫ్యూమ్‌లు వాడటం వల్ల చర్మసమస్యలు, ఆస్తమా వంటి వ్యాధులు కూడా వస్తాయి. మరి ఇప్పుడు ఎలా..? మంచి స్మెల్‌ రావాలి..ఎలాంటి లొల్లి ఉండకూడదు.. ఎంత నీట్‌గా స్నానం చేసినా పెర్ఫ్యూమ్‌ లేకపోతే అంత మంచిగా అనిపించదు. ఫ్రెష్‌ ఫీల్‌ రాదు కదా..? మీకు తెలుసా..కొన్ని రకాల ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను పెర్ఫ్యూమ్‌లా వాడుకోవచ్చు. అవేంటంటే..

నెరోలి ఆయిల్: మార్కెట్‌లో నెరోలి పెర్ఫ్యూమ్స్‌ బాగానే దొరుకుతాయి. ఇది పువ్వుల సువాసనను కలిగి ఉంటుంది. పైగా ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.

రోజ్ ఆయిల్ : ఈ ఆయిల్‌ పెర్ఫ్యూమ్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ సువాసన శక్తిని ఇవ్వడంతో పాటు మంచి ఫ్రష్‌ ఫీల్‌ను కూడా అందిస్తుంది.

లావెండర్ ఆయిల్: ఇది మీకు బాగానే తెలిసి ఉంటుంది. లావెండర్‌ స్మెల్‌ వల్ల నిద్రకూడా బాగా పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఉంటే. బెడ్‌పై లావెండర్‌ సోప్‌ పెట్టుకుంటే ఆ స్మెల్‌కు త్వరగా నిద్రపోవచ్చు. ఇది సైంటిఫిక్‌గా కూడా నిరూపించారు. ఇంకా చర్మం, జుట్టు సంరక్షణలో లావెండర్ ఆయిల్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీని సువాసన ఆందోళన సమస్యలను దూరం చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వీటితో తయారు చేసిన పెర్ఫ్యూమ్‌లు లేదా ఈ ఆయిల్‌ను రెండు చుక్కలు పెర్ఫ్యూమ్‌గా వాడుకోవచ్చు.

శాండల్‌వుడ్ ఆయిల్: ఇక బ్యూటీ ప్రొడక్ట్స్‌లో శాండల్‌వుడ్‌ హవానే వేరు. అందానికి నెంబర్‌వన్‌గా పనిచేస్తుంది. దీని సువాసనతో భలే మంచిగా అనిపిస్తుంది కదా..! మనసుకు రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇది మార్కెట్లో విరివిగా లభిస్తుంది. ఈ శాండల్‌వుడ్‌ ఆయిల్‌ వాడటం వల్ల ఒత్తిడిగా, చిరాకుగా కూడా ఉండదు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుందట.

ఘాటన పెర్ఫ్యూమ్‌ వల్ల తలనొప్పి, వికారంగా అనిపిస్తుంది. ఇలాంటి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వల్ల అటు చర్మానికి కూడా మంచిది. ఇంకా మీ దగ్గర నుంచి మంచి గుమాలించే వాసన కూడా వస్తుంది. ఈ సారి ట్రై చేసి చూడండి.