పచ్చగన్నేరు చెట్టు గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

-

పచ్చ గన్నేరు చెట్టు గురించి మీకు తెలుసా..? ఇంటి పెరట్లో సులువుగా పెరిగే మొక్క ఇది.. ఈ చెట్టు ఆకులు స‌న్న‌గా, పొడుగ్గా, పువ్వులు ప‌సుపు ప‌చ్చ రంగులో చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. ఈ చెట్టు చాలా సులువుగా పెరుగుతుంది. నీరు త‌క్కువ‌గా ఉండే ప్రాంతాలలో కూడా ఈ చెట్టు పెరుగుతుంది. ప‌చ్చ గ‌న్నేరు చెట్టుకు సూసైడ్ ప్లాంట్ అనే పేరు కూడా ఉంది. ఈ చెట్టు గింజ‌ల‌నే గన్నేరు ప‌ప్పు అంటారు. ఈ చెట్టు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌డ‌మే కాకుండా ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతుంది. ఈ చెట్టు గింజ‌ల‌ల్లో ఉండే విషం హృద‌య స్పంద‌న‌లపై ఎంతో ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ప‌చ్చ గ‌న్నేరు గింజ‌ల‌ను తిని బ్రతికినా కూడా భ‌విష్య‌త్తులో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంటారు..

Pacha Ganneru : ప‌చ్చ గ‌న్నేరు చెట్టుకు చెందిన ఈ ముఖ్య‌మైన విష‌యాలు తెలుసా ?

పచ్చగన్నేరు చెట్టు గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్..

ఈ చెట్టు నుండి వ‌చ్చే పాలు కూడా విష‌పూరిత‌మైన‌వే.
ఈ మొక్క‌ను ఇండ్ల‌లో పెంచుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ట‌. ఈ చెట్టు గాలి సోకినా కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. మ‌ఖ్యంగా పిల్ల‌లను ఈ చెట్టుకు దూరంగా ఉంచాలి.
ప‌చ్చ గ‌న్నేరు చెట్టు ఎంతో విష‌పూరిత‌మైన‌ది. అయిన‌ప్ప‌టికీ ఈ చెట్టు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది.
బాహ్య శ‌రీరంపై మాత్ర‌మే ఈ చెట్టు నుండి త‌యారు చేసే ర‌సాల‌ను, క‌షాయాల‌ను ఉప‌యోగించాలి. కడుపులోకి మాత్రం ఎట్టి ప‌రిస్థితులలోనూ తీసుకోకూడ‌దు. ప‌చ్చ గ‌న్నేరు చెట్టును ఔష‌ధంగా ఉప‌యోగించేట‌ప్పుడు దీని గురించి బాగా తెలిసిన వారి స‌మ‌క్షంలో లేదా ఆయుర్వేద నిపుణుల సాయంతోనే వాడాలి.. తెలిసీ తెలియ‌కుండా ఈ చెట్టును ఔషధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప్రాణాల‌కు ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంటుంది. ఈ సమస్థ జీవరాశిలో ఎన్నో మొక్కలు, ఎన్నో జంతువులు ఉన్నాయి.. కొన్ని మాత్రమే మనకు మేలు చేస్తాయి.. చెట్టు చూడ్డానకి బాగుంది కదా అని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదమే..!

Read more RELATED
Recommended to you

Latest news