సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌లో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు…పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ లో ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే…

దీనిలో మొత్తం 9,212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టులు వున్నాయి. వీటిలో పురుషులకు 9,105 పోస్టులు, మహిళలకు107 పోస్టులు ఉన్నాయి. టెన్త్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత పొందుండాలి. 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

అదే డ్రైవర్‌ పోస్టులకు అయితే 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. హిందీ/ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మొదలైన వాటి మీద ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 25, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే… అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు కట్టాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇలా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక సాలరీ విషయానికి వస్తే… నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు చెల్లిస్తారు. అధికారిక నోటిఫికేషన్‌ లో పూర్తి వివరాలని https://crpf.gov.in/ చెక్‌ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news