ట్రెండింగ్‌లో ప్రభాస్ సలార్‌…

-

పాన్ ఇండియా మూవీ బాహుబ‌లి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత డార్లింగ్ ప్ర‌భాస్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.  ఆయ‌న సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చిత్రీక‌ర‌ణ‌లు చేయాల్సి వ‌స్తున్న‌ది.  దానికి త‌గిన‌ట్టుగానే క‌థ‌లు, ప్యాడింగ్ ఉంటోంది.  సాహో సినిమా యావ‌రేజ్‌గా నిలిచినా వంద‌ల కోట్ల రూపాయ‌లు క‌లెక్ట్ చేసింది అంటే కార‌ణం అదే.  ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాథేశ్యామ్ సినిమా పూర్తిచేసే ప‌నిలోఉన్నారు.  ఈ మూవీతో పాటుగా కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సలార్ చేస్తున్నారు.  ఈ మూవీకోసం ప్ర‌భాస్ కొత్త మేకోవ‌ర్ ట్రైచేస్తున్నారు.  కేజీఎఫ్ కోలార్ బంగారం గ‌నుల చుట్టూ క‌థ న‌డిస్తే, స‌లార్ బొగ్గు గ‌నుల‌కు సంబందించిన సినిమా కావ‌డం విశేషం.

prabhass
prabhass

ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు.  ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్తిఅయింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల బిజీలో ఉన్నారు.  అటు ప్ర‌భాస్‌కూడా రాథేశ్యామ్ పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు.  కాగా, నిన్న‌టి రోజున ఈ స‌లార్ మూవీలో స్పెష‌ల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రీనా కైఫ్‌ను తీసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.  దీంతో ఈ మూవీకి సంబందించిన న్యూస్ ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతున్న‌ది.  స‌లార్‌లోని మాస్‌లుక్‌తో కూడిన ప్ర‌భాస్ ఫొటోను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news