మీరు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? పెళ్లికి సిద్ధమయ్యే వాళ్ళు కచ్చితంగా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిది. అప్పుడు లైఫ్ బాగుంటుంది సమస్యలు ఉండవు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మంచి లక్షణాలు ఉన్న భార్య కనుక మీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా రోజంతా ఆనందంగా ఉండొచ్చు అన్ని రోజులు కూడా బాగుంటాయి. ప్రతి అబ్బాయి పెళ్లికి ముందు అమ్మాయి గురించి ఈ నాలుగు విషయాలని తప్పక తెలుసుకోవాలి అని చాణక్య నీతి శాస్త్రం ద్వారా చెప్పారు. మరి చాణక్య చెప్పినట్లు చేస్తే సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండొచ్చు.
పెళ్లికి ముందు ఆకారాన్ని కాకుండా గుణాన్ని చూసి పెళ్లి చేసుకోవాలి అని ఆచార చాణక్య అన్నారు. చాలా మంది అబ్బాయిలు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు కానీ నిజానికి అందం ఆకారం అస్సలు ముఖ్యం కాదు వారి గుణమే ముఖ్యం. వాళ్ల గుణాన్ని చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. సిగ్గుతో చక్కగా ఉందని అమ్మాయి అందం చూసి ఎంపిక చేసుకుంటే మీరే బాధపడాలి. వాళ్ళ గుణాన్ని చూసి పెళ్లి చేసుకుంటే సమస్యలు ఉండవు.
అలానే అమ్మాయి మాట్లాడే విధానాన్ని చూడాలి మాట్లాడే విధానం మంచి గుణం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు అని చాణక్య అన్నారు. అలానే స్త్రీకి ఓర్పు సహనం ఉండాలి. కుటుంబాన్ని నడిపే మహిళకి ఓర్పు సహనం ఎక్కువ ఉండాలి అవి లేనప్పుడు వాతావరణం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది.
కాబట్టి ఈ లక్షణాలు ఉన్న స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోండి. సంస్కృతి సంప్రదాయాలు ఎలా మారినా కుటుంబంలో పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని ఆ అమ్మాయి పాటించగలదో లేదో చూసుకోండి. కోపం ఎవరికైనా కూడా మొదటి శత్రువు కోపం ఎక్కువ ఉంటే ఇబ్బంది పడాలి. కోపం తక్కువగా ఉండే వాళ్ళని ఎంపిక చేసుకోండి ఇలాంటి అమ్మాయిలు కనుక మీ లైఫ్ లోకి వచ్చారంటే లైఫ్ అంతా కూడా ఎంతో బాగుంటుంది.