కోడిగుడ్లు వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ ఆహారం కింద‌కు వ‌స్తాయి..? తెలుసుకోండి..!

కోడిగుడ్ల‌లో మూడు భాగాలు ఉంటాయ‌ని తెలుసు క‌దా. ఒకటి పైన ఉండే పెంకు, రెండోది తెల్ల‌సొన‌, మూడోది లోప‌ల ఉండే ప‌చ్చ సొన‌.

కోడిగుడ్లు తినేవారు, తిన‌ని వారు ఎవ‌రైనా స‌రే.. వాటిని నాన్ వెజ్ ఆహారం కిందే జ‌మ‌క‌డ‌తారు. కానీ కొంద‌రు మాత్రం గుడ్ల‌ను వెజ్ ఆహారం అని అంటారు. అయితే ఈ డిబేట్ ఎప్ప‌టి నుంచో న‌డుస్తోంది. కానీ కొంద‌రు మాత్రం కోడిగుడ్లు వెజ్జా, నాన్ వెజ్జా అని చూడ‌కుండా లాగించేస్తుంటారు. వాటితో ప‌లు ర‌కాల వంట‌లు చేసుకుని లేదా ఉడ‌క‌బెట్టుకుని, ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. అయితే మ‌రి.. అస‌లు కోడిగుడ్లు నిజంగానే నాన్ వెజ్ ఆహారమా..? అందులో నిజంత ఎంత ఉంది.. తెలుసుకుందాం ప‌దండి..!

కోడిగుడ్ల‌లో మూడు భాగాలు ఉంటాయ‌ని తెలుసు క‌దా. ఒకటి పైన ఉండే పెంకు, రెండోది తెల్ల‌సొన‌, మూడోది లోప‌ల ఉండే ప‌చ్చ సొన‌. తెల్ల సొన‌లో ప్రోటీన్లు, నీరు ఉంటాయి. అందులో జంతువుల‌కు సంబంధించిన క‌ణాలు ఉండ‌వు. క‌నుక దాన్ని ప్యూర్ వెజ్‌గా చెప్ప‌వ‌చ్చు. ఇక ప‌చ్చ సొన‌లో ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌, ప్రోటీన్లు ఉంటాయి. వాటితోపాటు ప్ర‌త్యుత్ప‌త్తి క‌ణాలు చాలా త‌క్కువ సంఖ్య‌లో ఉంటాయి. అందువ‌ల్ల ప‌చ్చ సొన‌ను నాన్‌వెజ్ అని చెప్ప‌వ‌చ్చు.

అయితే అస‌లు విష‌యానికి వ‌స్తే.. కోడిగుడ్ల‌ను వెజ్ ఆహారం అనే చెప్పాలి. ఎందుకంటే.. వాటిల్లో జంతు క‌ణాలు ఉండ‌వు. ప‌చ్చ సొన‌లో క‌ణాలు ఉంటాయి కానీ.. అవి ప్ర‌త్యుత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డేవి. అవి కూడా చాలా అత్య‌ల్పంగా ఉంటాయి. అందువ‌ల్ల ఓవ‌రాల్‌గా చూస్తే కోడిగుడ్ల‌ను వెజ్ ఆహార‌మే చెప్ప‌వ‌చ్చు. మ‌రి అవి కోడి నుంచి వ‌స్తాయి క‌దా.. అంటారా.. అయితే మ‌రి పాలు కూడా జంతువుల నుంచి వ‌స్తాయి క‌దా.. వాటినేమంటారు.. వెజ్ అనా, నాన్‌వెజ్ అనా..? ఏదీ అన‌లేరు కదా. అలాగే గుడ్లను కూడా 100 శాతం వెజ్ అని చెప్ప‌లేం. కానీ 99.99 శాతం వ‌ర‌కు అందులో ఉండేది వెజ్ ప‌దార్థ‌మే.. క‌నుక కోడిగుడ్ల‌ను వెజ్ ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు..!