హోళీ స్పెషల్ సాంగ్: హోళీ హోళీల రంగ హోళీ.. చమ్మకేళిల హోళీ

-

హోళీ పండుగను ముందురోజే కాముని దహనంతో ప్రారంభిస్తారు. కాముని బొమ్మను తయారు చేసి ప్రధాన కూడళ్ల వద్ద కట్టెలు పెట్టి కామదహనాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో అందరూ కలిసి పాటలు పాడుతూ నృత్యాలను చేస్తారు. తెల్లవారి అందరూ కలిసి రంగులకేళీని నిర్వహించుకుంటారు.

హోళీ.. దీన్నే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే.. కలర్లతో చేసుకునే పండుగ ఇది. రంగుల పండుగ ఇది. చిన్నా పెద్దా.. పేదా ధనికా.. కులం గోత్రం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా, ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. హోళీని జరుపుకుంటారు.

Holi special song 2019

అందుకే అదేదో సినిమాలో హోళీ హోళీల రంగ హోళీ.. చమ్మకేళిల హోళీ అంటూ ఓ పాట ఉంటుంది. ప్రేమకు ప్రతీకగా హిందువులు జరుపుకునే ప్రాచీన పండుగ ఇది. అయితే.. ప్రస్తుత జనరేషన్ లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అనే తేడా లేకుండా.. అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది.

Holi special song 2019

ఈ పండుగ ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణిమనే హోళీగా, కాముడి పున్నమిగా నిర్వహిస్తుంటారు. శిశిర రుతువు వెళ్లి వసంతం రావడానికి మరో 15 రోజులు ఉందనగా.. ఈ పండుగను నిర్వహిస్తారు. శిశిరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు.. బంగారం వర్ణం, లేత ఆకుపచ్చ వర్ణాల మిశ్రమంగా కనిపించే అరుదైన కాలంలో వచ్చేదే హోళీ పండుగ. అంతే కాదు.. దుష్ట శక్తులపై విజయానికి ప్రతీకగా కూడా హోళీని జరుపుకుంటారు.

ఈసంవత్సరం మార్చి 21న హోళీ సందర్భంగా యూట్యూబ్ లో హోళీ పాటలు హుషారెత్తిస్తున్నాయి. వాటిలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలవుతున్న హోళీ స్పెషల్ సాంగ్ ఇది. ఇంకెందుకు ఆలస్యం… హోళీ స్పెషల్ సాంగ్ ను చూసి మీరు కూడా హోళీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news