పిల్లలను పెంచడంతో ఈ తప్పులు చేయకండి..!

-

పిల్లల: పిల్లలను పెంచడం అంటే అంత చిన్న విషయం కాదు.. వేళకు ఏదో ఒకటి పెడితే సరిపోదు.. వాళ్లను ఒక మొక్క పెంచినట్లు పెంచాలి. ప్రతీ దశలో వారిని గమనిస్తూ ఉండాలి. వాళ్లు చేప్పేది వినాలి. ఆచి తూచి ప్రవర్తించాలి. పిల్లలు భావోద్వేగాలను అంగీకరించడం నుంచి ఆలోచించి స్పందించడం నేర్చుకోవడం వరకు, తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు పెద్దయ్యాక వాళ్లుండే బంధంలో ఎలా మసులుకోవాలో తెలుస్తుంది. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్లు పెద్దయ్యాక నేరుగా ప్రభావం చూపుతుంది.

హద్దులు తెలియాలి
ఏ మనిషీ ప్రతీ పనినీ చెయ్యలేరు. ప్రతి దానికి ఒక హద్దుంటుందని వాళ్లకు తెలియజెప్పాలి. మీరు చేయలేని పనైతే కారణంతో సహా స్పష్టంగా చెప్పండి. వాళ్లు పెద్దయ్యాక ఎదుటి మనిషి నుంచి ఎంత వరకూ ఆశించొచ్చో అనే విషయంలో వారికి క్లారిటీ ఇవ్వాలి.

క్షమాపణ
మీరు మీ పిల్లల విషయంలో పొరపాటున ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడగండి. ఒక చిన్న సారీ చెప్పండి .ఇదే లక్షణం వాళ్లకూ అలవరుతుంది. తప్పును ఒప్పుకునే మనసుంటుంది.

భావోద్వేగాలు:
పిల్లలు మీతో ఏదైనా పంచుకునే స్వేచ్ఛ వాళ్లకు మీరు ఎప్పుడూ ఇవ్వాలి..వాళ్లు సాధించిన విజయాలు మాత్రమే ముఖ్యం కాదని తెలియజెప్పాలి. దానివల్ల చక్కని మనస్తత్వం ఏర్పడుతుంది.

స్పందన
మీకు ఎంత కోపమొచ్చినా కూడా మీ పిల్లలకు అర్థమయ్యేలా నిదానంగా చెప్పాలి.. ఊరికే చిన్నదానికి అరవకూడదు.. వారికి వివరించి చెప్పాలి. అలాగే పెద్దయ్యాక వాళ్లు కూడా ప్రశాంతంగా మాట్లాడటం, ఏదైనా విషయానికి ఆచితూచి నిదానంగా స్పందించడం నేర్చుకుంటారు.

మద్దతు
పిల్లలకు ప్రతి విషయంలో మీరు తోడున్నారనిపించాలి. వాళ్లకు కష్టాలొచ్చినపుడు మీరు ఆదుకుంటారనే నమ్మకం కలిగించాలి. అది మాటల్లో కన్నా మీ చేతల్లోనే చూయించాలి.

పిల్లలు మీతో ఏదైనా చెప్పడానికి భయపడినా, సంకోంచినా మీరు అడగండి.. వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి.. వాళ్లను గమనిస్తుండాలి. అలా అని వారికి సస్‌పెక్ట్‌ చేస్తున్నట్లు వారికి అనిపించకూడదు. పిల్లలను ఫ్రీడం ఇవ్వాలి. కానీ అది మీకు తెలసి ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news