అందుకే ఉదయభాను ఇలా మారిందా?నిజాలు ఇవే..

-

యాంకర్ ఉదయభాను.. ఈ పేరు గురించి అందరికి తెలుసు..ఆమె కెరియర్ మొదలు పెట్టిన మొదట్లో బాగా బిజీగా వుంది.ఇప్పుడు సుమక్క ఎంత బిజీ అయ్యిందో అంతకు మించి బిజీగా అయిపోయింది.ఎంత భారీ పారితోషికం తీసుకుంటుందో అంత బిజీగా అంత ఎక్కువ పారితోషికం అప్పట్లో ఉదయ భాను తీసుకునేది.అప్పటి బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే ఉదయ భాను రెమ్యునరేషన్ ఏకంగా హీరోయిన్స్ రేంజిలో ఉండేది. ఉదయ భాను కెరియర్ అంతా సాఫీగా సాగుతోంది, 4 సినిమా ఈవెంట్స్ 10 టీవీ కార్యక్రమాలు అన్నట్లుగా ఆమె జోరు మీద ఉన్న సమయంలో అనూహ్యంగా ఆమె జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆమె పెళ్ళి..ఇది ఒక మిస్టరీగానే ఉంది.ఇప్పటికి కూడా పలు పుకార్లు షికారులు చేస్తూనే ఉంటాయి. జనాల్లో ఉన్న ప్రచారం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే.. ఉదయభాను టీవీల్లో ఎంట్రీ ఇవ్వక ముందే 15వ ఏటా ఒక ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగిందని,కొన్ని కారణాలవల్ల అతడి నుండి విడిపోయింది. ఆ తర్వాత ఒంటరి జీవితం సాగిస్తున్న ఉదయ భానుకి కెరియర్ లో సక్సెస్ బూస్ట్ ఇచ్చినట్లయ్యింది. మరే విషయాల గురించి ఆలోచించకుండా కెరియర్ లో ముందుకు వెళుతున్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమ మొదలైంది.

విజయ్ కుమార్ మొదట్లో ఉదయ భాను వద్ద డ్రైవర్ గా చేసేవాడని.. ఉదయభాను ఆఫీస్ లో జాబ్ చేసేవాడని రకరకాలుగా అంటూ ఉంటారు. ఆయన ఏం చేసేవాడో కానీ ఉదయ భాను ని మాత్రం ప్రేమలో పడేశాడు. ప్రేమలో పడ్డ తర్వాత పెళ్లి విషయంలో తల్లితో గొడవలు పడింది..ఆమె ప్రేమ కారణంగానే బుల్లి తెరను దూరమైందని కథనాలు చెబుతున్నాయి. ఆమె యొక్క నిర్ణయం సరైనదే కానీ ఆమె తల్లి ఆ సమయంలో ఆమెకు మద్దతు తెలపక పోవడం వల్లే కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఈ స్థాయిలో ఉండవలసి వచ్చింది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఆమె బుల్లి తెరపై జోరు తగ్గించినా కూడా ఆ తరం ప్రేక్షకులకు ఉదయ భాను అంటే ఒక హీరోయిన్ స్థాయి స్టార్ డమ్‌ ఉన్న యాంకర్ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆమె మళ్ళీ బుల్లితెర పై తళుక్కుమంది.. మళ్ళీ ఆమె జోష్ కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం..

Read more RELATED
Recommended to you

Latest news