నెటిజ‌న్ల‌పై గ్లోబ‌ల్ స్టార్‌ ప్రియాంక చోప్రా ఫైర్‌..!

280

పెళ్ళికి ముందు బాగానే ఉండేవాళ్లం. చాలా హ్యాపీగా గ‌డిపాం. కానీ పెళ్లైన తర్వాత సాంప్ర‌దాయ ప‌ర‌మైన‌, సంస్కృతిక‌ ప‌రంగా చిన్న‌ చిన్న భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఒక్కోసారి తను సర్దుకుపోతాడు. మరోసారి నేను స‌ర్దుకుపోతున్నా. ఈ విష‌యంలో ఏం జరిగినా మన మంచికే అని నిక్ చెబుతుంటాడు. అది నాకు పెద్ద ఊర‌ట‌నిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న విషయాలు. కొంతమంది చేతుల సైగ‌ల‌తో మాట్లాడుకుంటారు. కానీ మేము మాత్రం మనసులతోనే మాట్లాడుకుంటాం. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు..

గ్లోబ‌ల్ స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా గ‌తేడాది హాలీవుడ్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని పెళ్ళి చేసుకుని వార్త‌ల్లో నిలిచింది. భార‌త్‌లోనే కాదు, హాలీవుడ్‌లోనూ ఆమె వివాహం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంత‌గా చ‌ర్చ‌నీయాంశం కావ‌డానికి కార‌ణం ప్రియాంక వ‌యసులో నిక్ త‌న‌కంటే చిన్న కావ‌డం. నిక్ కంటే ఆమె ప‌దేండ్లు పెద్ద. దీంతో చాలా మంది ఆమె పెళ్ళిపై సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు నిక్‌కి త‌ల్లిగా ఉందంటూ మైండ్‌లో తోచిన పోస్టులు పెడుతున్నారు.

ఇలాంటి ప‌లు వ్యాఖ్య‌లు చూసి ప్రియాంక‌కు మండింది. ఇన్ని రోజులు స‌హ‌నంతో ఉన్న ఆమె ఇప్పుడు ఘాటుగా స్పందించింది. ఓ అమెరికన్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘చాలా మంది మా గురించి నోటికొచ్చినట్టు చెత్త‌గా వాగుతున్నారు. ఇప్ప‌టికీ అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నేను నా కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నానని అందరూ నానా మాటలు అంటున్నారు. ఒకవేళ నాకంటే అబ్బాయి వయసులో పెద్దవాడు అయివుంటే మాత్రం ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. నేను అలా పెళ్లి చేసుకుని ఉంటే కామెంట్లు చేసేవారికి నచ్చుండేదేమో. ఇక్క‌డ నాకు ఆశ్చర్యానికి గురిచేసే అంశ‌మేంటంటే భార్య కంటే భర్త ఎంత పెద్దవాడైనప్పటికీ ఎవ‌రికీ అభ్యంతరం ఉండదు. కానీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి మాత్రం విమర్శలు చేయ‌డానికి రెడీగా ఉంటారు. భార్య కంటే భ‌ర్త ఎన్నేండ్లు పెద్దైనా ఓకేనా?’ అని మండిప‌డ్డారు.

తనకు, నిక్‌ జోనస్‌కు ఉన్న సంప్రదాయ వ్య‌త్యాసాల‌ గురించి ప్రియాంక మాట్లాడుతూ,‘పెళ్ళికి ముందు బాగానే ఉండేవాళ్లం. చాలా హ్యాపీగా గ‌డిపాం. కానీ పెళ్లైన తర్వాత సాంప్ర‌దాయ ప‌ర‌మైన‌, సంస్కృతిక‌ ప‌రంగా చిన్న‌ చిన్న భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఒక్కోసారి తను సర్దుకుపోతాడు. మరోసారి నేను స‌ర్దుకుపోతున్నా. ఈ విష‌యంలో ఏం జరిగినా మన మంచికే అని నిక్ చెబుతుంటాడు. అది నాకు పెద్ద ఊర‌ట‌నిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న విషయాలు. కొంతమంది చేతుల సైగ‌ల‌తో మాట్లాడుకుంటారు. కానీ మేము మాత్రం మనసులతోనే మాట్లాడుకుంటాం. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు’ అని నిక్ ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది.

ఇదిలా ఉంటే నిక్ ప్రస్తుతం వరుస మ్యూజిక్‌ కన్సర్ట్‌లతో బిజీగా ఉండగా.. ప్రియాంక బాలీవుడ్‌లో ‘స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో న‌టిస్తున్నారు. దాదాపు మూడేండ్ల గ్యాప్ త‌ర్వాత ప్రియాంక బాలీవుడ్‌లో న‌టిస్తున్న చిత్ర‌మిది. సోనాలీ బోస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిం, రోహిత్‌ సరఫ్‌ కీలక పాత్రలు పోషించారు. మొటివేష‌న‌ల్ స్పీక‌ర్ ఆయేషా చౌద‌రి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. అతి చిన్న వ‌య‌సులో మొటివేష‌న‌ల్ స్పీక‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆయేషా ప‌ల్మోన‌రీ ఫైబ్రోసిస్ అనే వ్యాధితో క‌న్నుమూశారు. మ‌రో వైపు సంజ‌య్ లీలా భ‌న్సాలీ చిత్రానికి ప్రియాంక నో చెప్పింద‌ట‌. భ‌న్సాలీ త్వ‌ర‌లో ఇన్‌షాల్లా పేరుతో ఓ సినిమాని రూపొందించ‌బోతున్నారు. ఇందులో స‌ల్మాన్ ఖాన్ హీరో. స‌ల్మాన్ హీరోగా ఈ సినిమాకి సైన్ చేయ‌డం వ‌ల్ల తాను న‌టించ‌లేన‌ని చెప్పింద‌ట‌. ఆ స్థానంలో అలియాభ‌ట్‌ని ఎంపిక చేసిన విష‌యం విదిత‌మే.