ఇళ్లు క్లీనింగ్ అంటే ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు.. వాళ్లు దిగనంతవరకే.. ఒక్కసారి క్లీనింగ్‌లోకి దిగారా.. ఇక అంతే..వాటి భరతం పడతారు.. అయితే అలానే ఓ మహిళ క్లీనింగ్‌లో పడి ఏకంగా 12 అంతస్థుల భవనంపై నుంచి విండో బయటకు వచ్చి క్లీనింగ్ చేస్తుంది. కనీసం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. కాలు స్లిప్ అయిందంటే.. ముక్కలు కూడా దొరకవు అంత డేంజర్.. ఈ తంతగాన్ని అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్‌గా మారింది..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ ఎలాంటి భద్రతా లేకుకండా ఎత్తైన భవనం పైన కిటికిలోంచి బయటకు వచ్చి చిన్న గోడ అంచుపై నిలబడి టవల్‌తో కిటీకిని క్లీన్ చేస్తుంది. ఆమె ఎత్తులో నిల్చుని ఉందో కూడా వీడియో జూమ్ ఔట్ చేసి చూపిస్తారు.. అలా చూసినప్పుడు మనకే భయంగా అనిపిస్తుంది. కానీ ఆ మహిళ మాత్రం భలే ధైర్యంగా చేసింది.. కొలంబియాలోని మెడెలిన్‌లోని ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనం అంచుపై నిలబడి, 12వ అంతస్తులో ఎలాంటి భద్రతా కట్టు లేకుండా ఆ మహిళ శుభ్రం చేస్తుంది.. ఆమె ఎవరూ ఈ వివరాలు ఏవీ తెలియరాలేదు.. చాలావరకూ నెట్టింట్ వైరల్ అయ్యే వార్తలకు అడ్రస్‌లు ఉండవు.. ఎవరో ఎక్కడ నుంచో తీసి పోస్ట్ చేస్తారు.. అవి కాస్త సోషల్ మీడియాను దుమ్మురేపుతాయి.. ఈ వీడియో కూడా అలాంటిదే..!
ఈ వీడియో చూసి నెటిజ్లను ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కమెంట్ చేస్తున్నారు. ఈ నెల 15న ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఈ వీడియోకు ఇప్పటికే 242k వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ అద్భుతాన్ని చూసేయండి.. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.!