ఐపీఎల్ ముంబై ఇండియ‌న్స్ కోసం రెస్టారెంట్‌.. జింగ్ జింగ్ అమేజింగ్‌

ఐపీఎల్‌కు మ‌న దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దీన్ని చూసేందుకు క‌రోనా రాక‌ముందు జ‌నాలు ఎగ‌బ‌డేవారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఐపీఎల్ వ‌స్తోందంటే దేశంలో ఒక పండ‌గ‌లాగే ఉండేది. కోట్లాదిమంది టీవీల‌కే అతుక్కుపోయేవారు. కాగా క‌రోన కార‌ణంగా ఈ ఏడాదిలో జ‌రిగిన ఐపీఎల్ మ‌ధ్యంత‌రంగా ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ‌టంతో అర్ధాంతరంగా ఆగిపోయినా ఎట్టకేలకు మళ్లీ స్టార్ట్ అయ్యేందుకు రెడీ అయిపోయింది.

ఈ ఏడాది ఐపీఎల్ 2021 ఎక్కడైతే ఆగిపోయిందే మ‌ళ్లీ అక్కడి నుంచే స్టార్ట్ చేసేందుకు బీసీసీఐ రెడీ అయిపోయింది. ఇందుకోసం సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఈ మెగా మ్యాచ్ స్టార్ కాబోతోంది. ఈసారి కరోనా అడ్డు త‌గ‌ల‌కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మేనేజ్ మెంట్లు ఇందుకోసం ప్రతి ఒక్కరికీ ఆరు రోజుల పాటు క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇక ఇక్క‌డ విష‌యం ఏంటంటే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ ఎగ‌రేసుకుపోయిన ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్లు తమ ఆటగాళ్లు ట్రైన్ అయ్యేందుకు ఒక హోటల్ తో పాటు ప్రాక్టీస్ చేయడానికి, క్వారంటైన్ టైమ్‌లో ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసింది.

కాగా ఈ నెల 13నుంచి క్వారంటైన్ లో ఉంటున్న ముంబై స్క్వాడ్ యూఏఈలో ఉండుందుకు ఒక సెయింట్ రెజిస్ సాదియత్ రిసార్ట్ లో ఒక్క రాత్రికి రూ.25వేలు చెల్లించి స్టే చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ట్రైనింగ్ సెషన్స్ అయిపోయాక క్రికెట‌ర్లు ఫ్యామిలీలతో ఉండేందుకు ఏకంగా ఒక 5స్టార్ హోటల్ ఏర్పాటుచేసిన‌ట్టు తెలుస్తోంది. ఇది చాలా ల‌గ్జ‌రీగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ లో ప్రైవేట్ బీచ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయ‌ని స‌మాచారం. ఇది చాలా అద్భుతమైన ఇంటీరియర్ వర్క్ తో మెస్మ‌రైజ్ చేస్తుందంట‌.