‘గంగానదిలో మీ పేరు మీద మునుగుతాను.. రూ. పది ఇవ్వండి చాలు..!

-

దేవుడి ప్రాణం ఇచ్చి మనల్ని ఈ లోకంలో వదిలేస్తాడు.. మళ్లీ అదే దేవుడు ఆ ప్రాణాన్ని తీసుకునే పోయే వరకూ మనం బతకాలి.. ఈ పోరాటంలో కష్టాలు ఉంటాయి.. సుఖాలు ఉంటాయి.. చిన్న కడుపును నింపుకోవడానికి ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. అందుకే కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఆ కోటిలోనే మనోడు ఓ వెరైటీ విద్యను ఎంచుకున్నాడు.. రోజంతా గంగానదిలో మునకలేస్తూ డబ్బులు తీసుకుంటున్నాడో వ్యక్తి. ఇతని గురించిన వీడియో ఐఏఎస్ ఆఫీసర్ అవినాష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేశారు.

ఈ సీజన్లో ఉత్తమ స్టార్టప్ ఇదే అంటూ కామెంట్ చేశారాయన. ఆ పోస్టుకు ఎంతో మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. లక్షల వ్యూస్ కూడా వచ్చాయి.
వీడియోలో ఒక వ్యక్తి గంగా నది లోని రెయిలింగ్ మీద కూర్చుని ఉన్నాడు. అతను గట్టిగా ‘నేను మీ పేరు మీద గంగలో మునక వేస్తా, నాకు మీరు 10 రూపాయలు ఇవ్వండి చాలు’ అని అరుస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.. అదే అతని జీవనాధారంగా మార్చుకున్నాడు.

శీతాకాలంలో గంగానది చాలా చల్లగా ఉంటుంది. అంత చలికి పెద్ద వయసు వారు తట్టుకోవడం చాలా కష్టం. అంత దూరం వెళ్లాక గంగానదిలో మునక వేసి, పాపాలు పోగొట్టుకోలేదనే బాధ వారి మనసులో ఉంటుంది.. అలాంటి వారు ఈ వ్యక్తికి డబ్బులు ఇచ్చి తమ పేరు మీద మునక వేయమంటున్నారు.. ఎవరు డబ్బులిస్తారో వారి పేరు చెప్పి ఇతను మునుగుతాడు. గుళ్లో పూజారి మన పేరు మీద పూజ చేసి ఆఖర్లో మమ అనమంటారు.. అంటే ఆ పూజ అంతా మనం చేసినట్లు అవుతుంది.. ఇది అలాగే… మన పేరు మీద ముగినా.. మనం మునిగినట్లే అవుతుంది అని కొందరు భావిస్తున్నారు. అంతటి చల్లని నీళ్లలో ఉదయం నుంచి మునకలు వేస్తుంటే అతని ఆరోగ్యం ఏమవుతుందో అని ఆలోచించే నెటిజన్లు కూడా ఉన్నారు. కానీ ఏం చేస్తాం.. బతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా..

ఏది ఏమైనా కాలానుగుణంగా అతనికి వచ్చిన ఐడియా మాత్రం చాలా మందికి కొత్తగా అనిపించింది. ఇలాంటివి ఇండియాలో మాత్రమే కనిపిస్తాయి అని ఒకరు కామెంట్ చేస్తే, ఇండియా బయటికి వెళితే ఇలాంటి పనులు పనిచేయవు అని మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా మిగతా అందరితో పోలిస్తే ఇది చాలా ఇన్నోవేటివ్ ఆలోచన అని ఒప్పుకోవాల్సిందే. ఇతడికి డబ్బులు రావడం చూస్తే చుట్టుపక్కల శీతాకాలం, వానా కాలంలో ఇలాంటి వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news