రియల్‌ లైఫ్‌ కనులు కనులను దోచాయంటే సినిమా.. ఆమె టార్గెట్‌ మగవాళ్లే..!!

-

దుల్కర్‌ సల్మాన్‌, రీతు వర్మ యాక్ట్ చేసిన కనులు కనులను దోచాయంటే మూవీ చూసే ఉంటారుగా.. అందులో హీరో దొంగతనాలు చేస్తుంటే.. హీరోయిన్‌ జనాలను మోస్తం చేస్తుంది. సరిగ్గా ఇలాంటి స్టోరీయే రియల్‌ లైఫ్‌లో జరిగితే.. ఆ మూవీలోలానే జనాలను బక్రా చేస్తూ.. పదిరెట్లు ఎక్కువ సంపాదించిన ఓ యువతి స్టోరీ ఇది..
లైఫ్‌ అనేది.. ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అంటారు.. కానీ కొంతమంది లైఫ్‌ మరీ ప్రతి సీన్‌ క్లైమాక్స్‌లా ఉంటుంది. అలాంటి మలుపులే ఈ అమ్మాయి.. డానియెల్లీ మిల్లర్ లైఫ్‌లో జరిగాయి… ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అకౌంట్‌ని గమనిస్తే.. రాయల్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమె అసలు కథ వేరే ఉంది.
32 ఏళ్ల మిల్లర్‌ని కిలాడీ, మోసగత్తె, కిలేడీ, చీటర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మాన్‌హట్టన్‌కి చెందిన ఈమె.. తరచూ ఇన్‌స్టాలో డిజైనర్ గూడ్స్, లగ్జరీ కార్లు, లష్ హాలిడే సూట్స్ చూపిస్తుంది. లావిష్ లైఫ్‌స్టైల్‌ లుక్‌లో కనిపిస్తుంది. డానియెల్లే మిల్లర్.. ఓ మాయలేడీ. జనాన్ని బుట్టలో వేసుకొని.. అడ్డంగా ముంచడంలో ఈమెకు సాటి ఎవరూ లేరు అనొచ్చు.. తన లాంటి మరో చీటర్ అన్నా డెవ్లీతో కలిసి.. చాలా మోసాలు చేసింది. దీన్ని ప్రేరణగా తీసుకుని నెట్‌ఫ్లిక్స్‌‌లో ఇన్వెన్టింగ్ అన్నా అనే షో వచ్చింది తెలుసా..?
ఇన్నేళ్లూ ఆమె చేసిన మోసాలకు.. ఈ సంవత్సరం అక్టోబర్‌లో బ్రేక్ పడింది. ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఆమెపై ఉన్న కేసులపై విచారణ కొనసాగుతోంది. వాటన్నింటిలోనూ తీర్పు ఇస్తే.. ఆమెకు కొన్ని పదుల సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మిల్లర్‌ కాలి మడమకు ఓ సన్నటి బ్లాక్ బాక్స్‌ని పోలీసులు బలవంతంగా తగిలించారు. అది అస్సలు ఊడదు.. దీంతో ఆమె ఎక్కడెక్కడ ఉన్నదీ పోలీసులకు తెలిసిపోతుంది. ఇదివరకు ఫ్లోరిడా బ్యాంక్ చీటింగ్ కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు.

ఆమె ఏం చేస్తుందంటే..

కొంతమంది డబ్బున్న వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్న మిల్లర్.. వాళ్లతో చనువుగా ఉంటూ.. వాళ్ల ఐడీలు సంపాదిస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ అధికారుల్ని బుట్టలో వేసుకొని.. నకిలీ ఐడీలతో.. కోట్లకు కోట్లు మనీ లోన్ తీసుకుంటోంది. ఆ తర్వాత ఆ లోన్లు చెల్లించట్లేదు. సంపాదించే డబ్బును తెగ ఖర్చుచేస్తూ.. లైఫంటే ఎంజాయే అనేలా గడిపేస్తుంది.. అలానే ఇన్నాళ్లు జీవించింది.. చివరకు ఆమె హౌస్ అరెస్టు కావాల్సి వచ్చింది.

ప్రేమించడమే శాపం అయిందా..

మిల్లర్ ఇలా అవ్వడానికి బలమైన కారణం ఒకటి ఉంది. చిన్నప్పుడు జరిగిన ఓ ఘటన ఆమె మనసును తీవ్రంగా గాయపరిచింది. నిజానికి ఆమె ఓ సంపన్న కుటుంబానికి చెందినది. సెకండరీ స్కూల్‌లో చదివే రోజుల్లో.. 2004లో ఓ కుర్రాణ్ని ప్రేమించింది. అతను నువ్వు కన్యవే అని నిరూపించు అన్నాడు.
మిల్లర్.. అతని మీద ఉన్న ప్రేమతో.. ల్యాప్ టాప్ ద్వారా మూడు అడల్ట్ వీడియోలను రికార్డ్ చేసి.. అతనికి మెయిల్‌లో పంపింది. అతను వాటిని మిల్లర్ బెస్ట్ ఫ్రెండ్‌కి ఫార్వార్డ్ చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోలు మరింత మందికి షేర్ అయ్యాయి.

మాగాల్లే టార్గెట్..

తెలిసిందే కదా.. మంచి కంటే చెడు వేగంగా వ్యాపిస్తుంది. మిల్లర్ విషయంలోనూ అదే జరిగింది. దాంతో ఆమె పరువు పోయింది. నలుగురూ నాలుగు రకాలుగా అంటుంటే.. విసుగెత్తిపోయిన మిల్లర్.. సమాజంపై విపరీతమైన పగ పెంచుకుంది. తన జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి.. తాను కూడా సమాజంలో మగాళ్లను టార్గెట్ చెయ్యాలి అనుకుంది. ఆ తర్వాత వరుసగా మోసాలు చేస్తూ.. మగవాళ్లను ఆకర్షించి.. బుట్టలో పడేసుకుంటూ.. కనులు కనులను దోచాయంటే సినిమాలో హీరోయిన్ తరహాలో చేసింది మిల్లర్.. కానీ ఇప్పుడామె పోలీసులకు రెండోసారి చిక్కింది. ఇప్పుడు ఆమె ఇక బయటపడే అవకాశాలు కనిపించట్లేదు.
చిన్నప్పుడు జరిగే ఘటనలు మన మనసుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి అనడానికి మిల్లర్ జీవితం ఓ పెద్ద ఉదాహరణ. తాను చేసింది తప్పే కావొచ్చు.. కానీ ఆమెను అలా మార్చింది సమాజం కాదంటారా..?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...