ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దురదృష్టమే.. తొలగించేయండి..!

-

చాలామందికి మొక్కలని పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఇళ్లలో మంచి మొక్కలని పెంచుతూ ఉంటారు. మీరు కూడా మొక్కల్ని ఎక్కువగా పెంచుతుంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలని చూడాల్సిందే ఈ మొక్కలు కనుక ఇంట్లో ఉంటే దురదృష్టం కలుగుతుంది. సమస్యలు వస్తాయి. ఇంట్లో ఈ మొక్కలు ఉండడం వలన ఒత్తిడి ఎక్కువవుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. మానసిక స్థితిని పెంచి కాలుష్యం తొలగిస్తాయి మొక్కలు. అయితే ఈ మొక్కలని ఇంట్లో ఉంచుకుంటే మాత్రం సమస్యలు కలుగుతాయి.

హైడ్రేంజర్స్ అనే మొక్కలు అందంగా ఉంటాయి కానీ వీటి వలన ఒంటరిగా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది పైగా వీటిని ఇంట్లో ఉంచితే దురదృష్టం కలుగుతుంది. అదృష్టం అంతా పోతుంది ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. బోన్సాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అయితే బోన్సాయ్ మొక్కలు ఇంట్లో ఉండడం వలన దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా కెరీర్ లో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటి లోపల అస్సలు వీటిని పెట్టకూడదు దీంతో ఇబ్బందులు తప్పవు కాబట్టి ఈ మొక్కలని అస్సలు ఇంట్లో ఉంచకండి.

చింత మొక్కలు కూడా ఇబ్బందులని తెస్తాయి. అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి. దురదృష్టాన్ని ఇస్తాయి. కాబట్టి చింత చెట్టు ని మొక్కని కూడా ఇంట్లో ఉంచకండి అలానే మొక్కలని ఇంట్లో ఉంచేటప్పుడు వాటిపై శ్రద్ధ కచ్చితంగా తీసుకోవాలి. వాడిపోయిన మొక్కలు ఎండిపోయిన వాటి వలన సమస్యలు వస్తాయి. నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. బాధలే వస్తాయి దురదృష్టమే ఉంటుంది అదృష్టం ఉండదు సమస్యలు తప్పవు. ముళ్ళ తో కూడిన మొక్కల్ని కూడా ఇంట్లో ఉంచకండి ఇవి కూడా నెగటివ్ ఎనర్జీ ని తీసుకు వస్తాయి కాబట్టి ఈ మొక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news