మృగశిర కార్తె స్పెషల్.. సందడిగా చేపల మార్కెట్

-

మృగశిర కార్తె వచ్చేసింది. సాధారణంగా మృగశిర అనగానే గుర్తొచ్చేది చేపలు. కార్తె ప్రారంభమైన రోజున చేపలు తినటం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. చేపల వేటతో చెరువుల వద్ద కోలాహలం నెలకొనగా…. కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌ రాంనగర్‌, ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌కు జనం బారులు తీరారు.

మృగశిర సందర్భంగా జిల్లాల నుంచే కాకుండా ఏపీలోని కృష్ణా, గుంటూరు,  పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, కృష్ణ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి వేలాది టన్నుల చేపలు నగరానికి చేరుకున్నాయి. ముషీరాబాద్‌ మార్కెట్‌కు నిన్నటి నుంచే లారీలు వరుస కట్టాయి. ఇక్కడ రవ్వు, బొచ్చ, కొర్రమీను, పాంప్లెట్‌, బంగారు తీగతో పాటు రొయ్యలు, పీతలు పెద్దఎత్తున దిగుమతి అయ్యాయి. కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో చేపల ధరలు సైతం భారీగా పెరిగాయి. సాధారణంగా రవ్వు, బొచ్చ 70 నుంచి 80 రూపాయల వరకు ఉంటుండగా 100కు పైగా విక్రయిస్తున్నాయి. కొర్రమీను హైబ్రిడ్ 300నుంచి  400 రూపాయలకు… అసలైన కొరమీను కిలోకు 500 నుండి 800 వరకు అమ్మకాలు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news