ప్రేమించిన వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోతే తిరిగి రప్పించడానికి కావాల్సిన టిప్స్..

ఏ బంధమైనా ఒకే రోజులో ఏర్పడదు. కాలంతో పాటు బంధం బలపడుతుంది. కానీ ఈ విషయం తెలుసా? ఎంత గట్టి బంధమైనా ఒక్క క్షణంలో తెగిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు చాలా బాధగా ఉంటుంది. వారితో బంధంలో ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఆ బంధం ప్రేమ అయితే ఆ జ్ఞాపకాల నుండి తప్పించుకోవడం కష్టం. మనసు మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది. అవతలి వారు తిరిగి రావాలని, వచ్చి మునుపటిలా ఉండాలని తహతహలాడుతుంటుంది.

కానీ అలా రావడం అంత తేలికైన పని కాదు. ప్రస్తుతం మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దూరమైతే తిరిగి వారిని మీ దరికి చేర్చుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మీ పని మీరు చేసుకోండి

పదే పదే వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉండకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి. కాలంతో పాటు మనుషులు మారతారు. మీలో కూడా మునుపటి కోపం తగ్గిపోతుంది. తద్వారా మీరు మరింత బాగా మాట్లాడగలరు. బంధాన్ని నిలబెట్టుకోవడానికి కొంచెం టైమ్ తీసుకోండి.

కాల్స్, మెసేజెస్ చేయవద్దు

నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్విలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ ఊరికే మెసేజీలు, కాల్స్ చేయవద్దు. కొద్దిగా టైమ్ తీసుకోండి. అవతలి వారికి ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి. మీతో బంధంలో లేకుండా ఉన్నప్పుడు అవతలి వాళ్ళు ఫీల్ అవగలగాలి.

వారిని కలవండి

అది కూడా కొద్దిగా టైమ్ తీసుకున్నాకే. బ్రేకప్ మూడ్ మారిపోయిన తర్వాత ఒకసారి కలుసుకోండి. ఫోన్ కాల్స్, మెసేజెస్ కంటే ప్రత్యక్షంగా కలుసుకోవడం బాగుంటుంది. నిజమైన భావాలు తెలియాలంటే కలుసుకోవడమే ఉత్తమం. కలిసిన తర్వాత మీరు లేకుండా ఎలా ఉందో వివరించండి. కలిసుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. అప్పుడు అవతలి వారి జవాబు కోసం ఎదురుచూడండి.