బిజినెస్ ఐడియా: ఆర్గానిక్ ఫార్మింగ్ తో లాభాలు లక్షల్లో..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. నిజానికి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల లక్షల్లో లాభాలు పొందొచ్చు. అయితే ఇది ఏదో చెప్పాలని చెప్పిన సంగతి కాదు. నిజంగా జరిగినది. ఆంధ్రప్రదేశ్లోని ఓబులాయపల్లి గ్రామం లో మారుతి నాయుడు కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి కూడా సంప్రదాయ వ్యవసాయం చేస్తూ వస్తోంది.

 

మారుతి 1996లో ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు . ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయాలని అనుకున్నారు. కానీ వ్యవసాయంపై ఆసక్తి ఉండడంతో వ్యవసాయాన్నే చేయాలని అనుకున్నారు. 9 ఎకరాల వ్యవసాయ భూమి లో వేరుశనగ మరియు తీపి సున్నం పండించడం మొదలుపెట్టారు మారుతీ. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మంచిదని నిర్ణయం తీసుకున్నారు.

అయితే రసాయనాలను ఉపయోగించటం వల్ల నేల క్రమంగా సారాన్ని కోల్పోతోందని గ్రహించారు. పైగా దిగుబడి కూడా తగ్గిపోతోంది అని తెలుసుకున్నారు అందుకనే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నారు. నిజానికి ఆర్గానిక్ ఫార్మింగ్ ఐడియా అతనికి మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడైతే మారుతి ఏకంగా ఏడాదికి 18 లక్షలు సంపాదిస్తున్నారు మారుతి.

ఇది చూసిన తోటి రైతులు అదే దారిలో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటున్నారు. నిజానికి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అటు భూమికి ఇటు మనకి కూడా మంచిది. పైగా మారుతి పంటల్ని పండించడం మాత్రమే కాకుండా ప్రతి ఏడాది 200 మందికి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఈ పద్ధతిని గురించి చెప్తున్నారు.

మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టొచ్చు. దీంతో మారుతి లాగే మీరు కూడా అద్భుతంగా రాబడిని పొందొచ్చు. ఏకంగా లక్షల్లో లాభాలు వస్తున్నాయి అంటే మాటలా

Read more RELATED
Recommended to you

Latest news