భవిష్యత్తులో ఇక ఆడవాళ్లదే రాజ్యమా..? మగవాళ్ల పుట్టుక ప్రశార్థకం అంటున్న తాజా పరిశోధన

-

జనరల్‌గా ఆడవాళ్ల సంఖ్య తక్కువగా ఉంది..పది మంది మగవారికి ఆరుగురు అమ్మాయిలే ఉంటున్నారు అని ఒకప్పటి గణాంకాలు చెప్పాయి.. కానీ తాజాగా జరిగిన పరిశోధన చూస్తే.. మగవారి మనుగడ ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పాలి. ఎప్పటినుంచో చాలామంది అమ్మాయిలు అనుకుంటున్నారు.. మగవారు లేని ప్రపంచం కావాలని.. ఆ రోజు రాబోతుందేమో..! భవిష్యత్తులో ఈ భూమిపై మగవాళ్లు పూర్తిగా అంతరించిపోతారేనేది ఓ పరిశోధన సారాంశం.. ఈ షాకింగ్‌ పరిశోధనలో తేలిన విషయాలేంటంటే..
ప్రపంచ శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏవో ఒక పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఆ క్రమంలో వారు ఒక్కోసారి ఆశ్చర్యకర విషయాలు చెబుతారు. అలాంటి ఓ విషయం తాజాగా కలకలం రేపుతోంది. భవిష్యత్తులో భూమిపై మహిళలు మాత్రమే ఉంటారనీ.. మగవారు పూర్తిగా అంతరించిపోతారనేది ఆ పరిశోధన చెబుతోంది.
జపాన్‌లోని ఓ దీవిలో అంతరించిపోతున్న కొన్ని మగ ఎలుకల్ని శాస్త్రవేత్తలు పరిశోధించారు. సాధారణంగా ఎలుకలు అంతరించే పరిస్థితి ఏర్పడదు. అవి చాలా త్వరగా తమ సంఖ్యను పెంచగలవు. అలాంటిది ఆ మగ ఎలుకలకు ఏమైందో తెలుసుకునేందుకు పరిశోధన చేయగా.. వాటిలో Y క్రోమోజోమ్ లేదని తేలింది. ఫలితంగా అక్కడ మగ ఎలుకలు చాలా తక్కువ ఉన్నాయి. ఆడ ఎలుకలే ఎక్కువగా ఉన్నాయి.
ఎలుకల పరిస్థితే మనుషులకూ వస్తుందనేది కొందరు శాస్త్రవేత్తల ఆలోచన. జనరల్‌గా మహిళల్లో XX క్రోమోజోమ్‌లు ఉంటాయి. మగవారిలో XY క్రోమోజోమ్‌లు ఉంటాయి. మగవారి నుంచి X క్రోమోజోమ్.. ఆడవారి X క్రోమోజోమ్‌తో కలిస్తే.. ఆడపిల్ల పుడుతుంది. అదే మగవారి నుంచి Y క్రోమోజోమ్.. ఆడవారి X క్రోమోజోమ్‌తో కలిస్తే.. పిల్లాడు పుడతాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే మగవారిలో ఆ Y క్రోమోజోమ్ ఉండదనీ.. అందువల్ల మగపిల్లలు పుట్టే అవకాశం పోయి.. మగజాతి అంతరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
జపాన్‌లోని అమామీ ఒషిమా దీవిలో ఈ పరిస్థితి ఎదురైంది. చిత్రమేంటంటే.. Y క్రోమోజోమ్ మాయమవడంతో పాటూ.. ఆడ ఎలుకల్లో.. స్వయం పునరుత్పత్తి కనిపించింది. అందువల్ల మగ ఎలుకలతో పనిలేకుండా.. ఆడ ఎలుకలు సొంతంగా సంతానాన్ని పెంచగలుగుతున్నాయట… ఇందుకు ప్రత్యేక జన్యువు కారణం అవుతోంది.
అయితే..ఇప్పట్లో మగ మానవులు అంతరించరు అనీ.. అందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే ఇలాంటి పరిశోధనలు మగవారిని భయపెడుతున్నాయి. ఇప్పటికే చాలా మందిలో సంతాన సాఫల్యత తగ్గుతోంది. ఇప్పుడు Y క్రోమోజోమ్ కూడా తగ్గిపోతే.. మగపిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతోంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.
సాధారణంగా జీవనశైలిలో వచ్చే మార్పుల వల్లే ఎక్కడ లేని సమస్యలు అన్నీ వస్తాయి. కాబట్టి.. మగవారు వై క్రోమోజోమ్‌ తగ్గకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో వైద్యులను సంప్రదించి వాటిని కూడా ఇప్పటి నుంచే డైట్‌లో భాగం చేసుకోవడం మేలు.. ముఖ్యంగా పెళ్లికాని అబ్బాయిలకు ఇది చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news