భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ఇక్కడి ప్రజలకే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ఎన్నికల ఫలితాల పట్ల కుతూహలం నెలకొంది.
దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కేవలం మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతల్లో టెన్షన్ తీవ్రతరమైంది. ఇక ప్రజలకు కూడా తమను పాలించబోయే నేత ఎవరో త్వరగా తెలుసుకోవాలన్న కుతూహలం కూడా పెరిగింది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున టీవీలకు అతుక్కుపోనున్నారు. ఇక విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అయితే పలు ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొని మరికొద్ది గంటల్లో వెలువడనున్న ప్రజా తీర్పును లైవ్‌లో వీక్షించనున్నారు.
భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ఇక్కడి ప్రజలకే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ఎన్నికల ఫలితాల పట్ల కుతూహలం నెలకొంది. దీంతో అలాంటి భారతీయుల ఉత్సాహాన్ని, ఆసక్తిని గమనించిన పలు ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థలు ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ వాచింగ్ పేరిట పలు ఈవెంట్లను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీగా ఈవెంట్లను నిర్వహించడంతోపాటు వాటిల్లో బీర్లు, బిర్యానీలను సప్లై చేస్తూ ఈవెంట్‌కు వచ్చేవారిని ఆకర్షించనున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గేట్ వే పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో పెద్ద పెద్ద టీవీ తెరలను ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు లైవ్‌లో ప్రసారం చేయనున్నారట. అదే ప్రోగ్రామ్‌కు ఇండియన్ ఎలక్షన్ 2019 కౌంటింగ్ అనే పేరు పెట్టారట. ఈ క్రమంలోనే లైవ్‌లో క్రికెట్ ప్రసారాలను పెద్ద తెరపై చూస్తూ ఎంజాయ్ చేసే విధంగానే పెద్ద తెరలపై ఎన్నికల ఫలితాలను చూస్తూ పలువురు ఎంజాయ్ చేయనున్నారు. అందుకు గాను 3 బీర్లకు 10 డాలర్లు, వెజ్ బఫెట్‌కు 15 డాలర్లు, నాన్ వెజ్ బఫెట్‌కు 18 డాలర్ల పేరిట పలు ప్రత్యేక వంటలతో మెనూలను కూడా సిద్ధం చేశారట.
అలాగే అమెరికాలోనూ ఇండియన్ ఎలక్షన్స్ లైవ్ రిజల్ట్స్ పేరిట పలు ఈవెంట్లను నిర్వహిస్తున్నారట. జడ్జిమెంట్ డే పేరుతో ఒక ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఈవెంట్‌కు 10 డాలర్లను ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు. అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ రాత్రి 9.30 నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఏది ఏమైనా.. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మాత్రం కేవలం మనల్నే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులనూ టెన్షన్‌కు గురి చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..!