జంతువుల్లో ధైర్యసాహసాలు కలిగివిగా సింహం, పులి చెప్తాం. వీటిని చూస్తే మొత్తం అడవిలో ఉన్న జంతువలన్నీ భయపడతాయి. అలాగే తెలివైనదిగా నక్క పేరు చెప్తుంటారు. నక్క అంత తెలివిగలది కదా కానీ మనం ఎందుకు జిత్తుల మారిది, కన్నింగ్ అంటాం. అసలు నక్క గురించి మీకు ఏం తెలుసు..? దాని ప్రత్యేకతలు చెప్తే ఆశ్చర్యపోతారు. నక్కకు ఆ జిత్తులమారిది అనే నింద ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా..!
అడవిలో జీవించే జంతువుల్లోకెల్లా నక్క అత్యంత తెలివైనది. తన బుద్ధితో అది తనకు హాని జరగకుండా, పెద్దగా కష్టపడకుండానే ఆహారం పొందుతూ, ఇతర జంతువుల బారిన పడకుండా హ్యాపీగా బతికేస్తుంది. నక్క ఎంతో తెలివైన జంతువు, అలాగే దేన్నైనా త్వరగా నేర్చుకుంటుంది. వాటికి ఎలా వేటాడాలో తెలుసు, వేట నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. దాని నైపుణ్యాలతో పెద్ద పెద్ద జంతువుల నుంచి కూడా సులభంగా తప్పించుకు తిరుగుతుంది. పెద్దగా కష్టపడకుండానే ఆహారం పొందుతుంది. నక్కకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. అది దేన్నైనా చాలా త్వరగా నేర్చేసుకుంటుంది. నక్కలు సహజంగా పెద్ద జంతువుల జోలికి వెళ్లవు. చిన్న చిన్న ప్రాణులనే వేటాడతాయి.
నక్క సమస్యలు వస్తే వాటిని చాలా సులభంగా పరిష్కరించుకుని ఆపద నుంచి బయటపడుతుందట. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాల్లో బతకగలదు. అలాగే నక్కలు నక్కలను వేటాడుకోవు. ఇతర జంతువులు వేటాడిన ఆహారాన్ని తెలివిగా దొంగలిస్తుందట..
నక్కలు అద్భుతమైన వినికిడి, దృష్టి, వాసన శక్తులను కలిగి ఉంటాయి. మనషులు వినలేని హై-పిచ్ శబ్దాలను కూడా నక్కలు వినగలవట.. చీకట్లోనూ స్పష్టంగా చూడగలవు. కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతువు మాంసం వాసనను కూడా గుర్తించగలగే శక్తి నక్కలకు ఉంటుంది.
నక్కలకు వాటి శరీరంతో పోలిస్తే మెదడు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా అధిక తెలివితేటలు నక్కల సొంతం. అద్భుతమైన ఇంద్రియ శక్తి నక్కలకు ఉంది. ఇవి పర్యావరణాన్ని అంచనా వేయగలవు. పరిస్థితులు అనుకూలించని చోట ఉండవు.