కేపీ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి వచ్చింది. ఈ కేపీ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు ఒక్క ఒక్కటి వస్తున్నాయి. సిక్కిరెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీల నిర్వాహణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డికి మంచి పేరు ఉంది. అయితే, కేపీని అరెస్ట్ చేసే సమయంలో సిక్కిరెడ్డి ఇంట్లో పార్టీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
సిక్కిరెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున సెలబ్రెటీలు వచ్చారట. సిక్కిరెడ్డి ఇంట్లో లేని సమయంలోనే డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సిక్కిరెడ్డి పాత్రపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి సిక్కిరెడ్డి విదేశాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేపీతో సిక్కిరెడ్డి…వందల కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు… సిక్కిరెడ్డి ఇంట్లో పార్టీ ఇచ్చినట్లు తెలిపాడు కేపీ. ఇక ఈ విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.