ఏ ఆట అయినా ఎలా ఆడతారు. ఎంతో జాగ్రత్తగా ఎటువంటి గాయాలు కాకుండా ఉండేలా చూసుకుంటారు. కానీ.. జపాన్ లోని ఈ ఆట మాత్రం చాలా డిఫరెంట్. ఆ ఆట పేరు బొతాయోషి. ఈ ఆట ఆడేవాళ్లకు గాయాలవుతాయి… తలలు పగులుతాయి.. అయినా కూడా అక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్లకు ఆటే ముఖ్యం. రక్తాలు కారుతున్నా.. ఆ ఆట ఆడుతుండటమే మజా అక్కడ.
అందుకే దాన్ని ఓ వింత క్రీడ అంటారు. ఇది ఇప్పటిదేమీ కాదు.. చాలా పాతదే. రెండు టీములు ఉంటాయి. ఒక్కో టీమ్ కు 75 మంది చొప్పున ఆటగాళ్లు ఉంటారు. ఒక్క తలకు మాత్రం హెల్మెట్ పెట్టుకుంటారు వీళ్లు. అయినా.. కూడా తలలు పగులుతుంటాయి ఒక్కోసారి. ఇక.. ఆట ఏంటంటే.. ఒక స్తంభం ఉంటుంది. 4 మీటర్ల పొడవు ఉన్న ఆ స్తంభాన్ని పడిపోకుండా… నిలబెట్టి ఉన్న స్తంభాన్న కింద పడకుండా ఆపాలి. అంతే.. అదే గేమ్. కాకపోతే… ప్రత్యర్థి టీమ్ మాత్రం ఆ స్తంభాన్ని ఎలా కింద పడగొట్టాలా అని పోరాటం చేస్తుంది. అక్కడికి వెళ్లి ఆ స్తంభాన్ని పడగొట్టడానికి వీర ప్రయత్నం చేస్తారు. అదే ఆట. ఆ సమయంలోనే ఒకరిని మరొకరు తోసుకోవడం.. గోళ్లతో రక్కడం, తలలతో కొట్టుకోవడం జరుగుతుంది. ఒకరి మీద మరొకరు పడటం, తొక్కడం… ఇలా ఎన్నో జరుగుతాయి. ఒకవేళ ఎవరికైనా సీరియస్ ఇంజూరీ అయితే వెంటనే ఆసుపత్రికి తరలించేలా.. అన్నీ సిద్ధంగా ఉంటాయి. అంబులెన్స్, డాక్టర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ తో సహా. అయితే.. ఇది చాలా ప్రమాదకరమైన ఆట అని.. జపాన్ లోని కొన్ని ప్రాంతాల్లో నిషేధించారట. స్కూళ్లలో కూడా. కానీ.. ఇప్పటికీ ఆ ఆటను కొన్ని ప్రాంతాల్లో ఆడుతుంటారు. ఈ ఆటను చూడానికి జనాలు కూడా విపరీతంగా ఎగబడతారు. వాళ్లు కొట్టుకుంటుంటే వీళ్లు తెగ సంతోషిస్తారు. మరి.. ఓసారి మీరు కూడా ఆ ఆటను చూసేయండి…