మృత్యుంజయురాలు ఈ చిన్నారి… మీది నుంచి రైలు పోయినా.. వీడియో

-

ఈ భూమ్మీద మనకు నూకలుండాలే కాని.. ఏదీ ఏం చేయలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ చిన్నారి.. సంవత్సరం వయసు ఉన్న చిన్నారి మీది నుంచి ట్రెయిన్ పోయినా చిన్న దెబ్బ కూడా తాకకుండా బతికి బట్టకట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మథుర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్నది.

స్టేషన్ లో ప్లాట్ ఫాం పక్కన ఓ మహిళ తన కూతురుతో సహా నడుస్తోంది. ఇంతలో ఆ మహిళ కూతురు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పై పడిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్ నుండి ట్రెయిన్ పోయింది. అంతే.. అందరూ అయ్యో.. అయ్యో.. పాప అనడం తప్ప ఎవరూ ఏం చేయలేకపోయారు. ట్రెయిన్ వెళ్లి పోయాక వెంటనే ట్రాక్ పై చూస్తే.. చిన్నారికి ఏం కాలేదు. వెంటనే ఓ వ్యక్తి ట్రాక్ పై దిగి ఆ చిన్నారిని పైకి తీసి తన తల్లికి అందించాడు. అయితే.. ట్రాక్ మీద పడకుండా.. ట్రాక్ కు, ప్లాట్ ఫాం కు మధ్య ఉన్న ప్రాంతంలో పడటంతో ఆ చిన్నారికి ఎటువంటి గాయాలు కూడా కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే.

Read more RELATED
Recommended to you

Latest news