వైర‌ల్ ఫోటో : అరె.. అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లా ఉన్నాడే? ఎవరీయన?

-

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. అది నిజమా అబద్ధమా అనేది చెప్పలేకపోయినా.. ఏడుగురు కాకపోయినా కనీసం ఇద్దరైనా ఉంటారు కాబోలు అనిపిస్తుంది ఇతడిని చూశాక. అవును.. ఓ వ్యక్తి.. అచ్చు గుద్దినట్టు జూనియర్ ఎన్టీఆర్ లా ఉన్నాడు. సేమ్ టు సేమ్.. ఆ పర్సనాలిటీ కానీ… ఇంకా ఆ గడ్డం కానీ.. స్టయిల్ కానీ.. నవ్వు కానీ.. అంతా జూనియర్ కు అచ్చు గుద్దినట్టే ఉంది.

ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఆయనే. ఆయన పేరు షమీందర్ సింగ్. తెలుగు వ్యక్తి కాదు లేండి. ఆయన ఊరు పంజాబ్. వృత్తి రిత్యా ఇంజినీర్ అయిన సింగ్ కు జూనియర్ ఎన్టీఆర్ తెలుసట. అంతే కాదు.. ఎన్టీఆర్ కు ఈయన పెద్ద ఫ్యానట. చూడటానికి సేమ్ టు సేమ్ ఉన్నందుకు కాదు.. ఆయన సినిమాలంటే షమీందర్ సింగ్ పడి చచ్చిపోతాడట.

ఇటీవల షమీందర్ సింగ్.. టిక్ టాక్ యాప్ లో ఓ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక.. ఎన్టీఆర్ అభిమానులైతే ఆ వీడియోలో ఉన్నది నిజంగా ఎన్టీఆరే అని అనుకొని పొరబడ్డారు కూడా.

షమీందర్.. ఎన్టీఆర్ సినిమాల్లోని డైలాగ్ లతో డబ్ స్మాష్ కూడా చేస్తాడు. ఆ వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో, టిక్ టాక్ యాప్ లో షేర్ చేస్తుంటాడు. ఎప్పటికైనా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ను కలుస్తా అంటున్నాడు షమిందర్.

Read more RELATED
Recommended to you

Latest news