VIRAL : ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే.. పెళ్లి కూతురు షరతులు !

-

పెళ్లంటే నూరేళ్ల పంట. నిండు నూరేళ్లు జీవించడానికి… హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తారు. అయితే ఓ అమ్మాయి మాత్రం కాబోయే భర్త విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టింది. వాడితో ఏవిధంగా అగ్రిమెంట్ నే రాసేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… అగ్రిమెంట్లో అమ్మాయి ఏం రాసిందో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.

ఇంతకీ ఆ పెళ్లికూతురు ఏం రాసిందంటే… తనకు కాబోయే భర్త నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలట. ఇంట్లో వండిన అన్నం తినడానికి ఎప్పుడు సరే అనాలట. ఇంట్లో రోజు చీర కట్టుకోవడానికి ఒప్పుకోవాలట. అలాగే లేట్ నైట్ పార్టీస్ తనతో మాత్రమే జరుపుకోవాలట. ప్రతిరోజు వ్యాయామానికి తప్పనిసరిగా వెళ్లాలట. ప్రతి ఆదివారం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ భర్త ప్రిపేర్ చేయాలట.

ప్రతి 15 రోజులకు ఒకసారి షాపింగుకు తీసుకువెళ్లాలట. ఇలా కొన్ని కండిషన్స్ తో అగ్రిమెంట్ రాసింది. కోసమేరుపు ఏంటంటే ఆ షరతులపై సంతకం చేసేందుకు పెళ్ళికొడుకు సిద్ధం కూడా అయ్యాడు. ఆ షరతులపై సంతకం చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news