ఆకాశం నుంచి వ‌చ్చి వ‌రించిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు..!

-

చాలా మంది త‌మ‌కు ఉండే నైపుణ్యాలు, ల‌క్ ద్వారా రాత్రికి రాత్రే పాపుల‌ర్ అవుతుంటారు. కొంద‌రు ధ‌న‌వంతులు అవుతుంటారు. ఇక కొంద‌రికి లాట‌రీ ద్వారా అదృష్టం ప‌డుతుంది. దీంతో వారు కోటీశ్వ‌రుల‌వుతారు. అయితే ఆ వ్య‌క్తిని మాత్రం అదృష్టం ఆకాశం నుంచి వ‌చ్చి వ‌రించింది. ఏంటీ.. అర్థం కాలేదా.. ఏమీ లేదు.. ఆకాశం నుంచి ప‌డిన చిన్న గ్ర‌హ శ‌క‌లం అత‌న్ని కోటీశ్వ‌రున్ని చేసింది.

meteorite made him millionaire

ఇండోనేషియాలోని ఉత్త‌ర సుమాత్రా ప్రాంతంలో నివాసం ఉండే జోషువా హుటాగ‌లుంగ్ వ‌య‌స్సు 33 ఏళ్లు. అత‌నికి ముగ్గురు సంతానం. కాగా తాజాగా అత‌ని ఇంటిపై రాత్రి పూట ఓ భారీ గ్రహ శ‌క‌లం ప‌డింది. దాని బ‌రువు 2.1 కిలోగ్రాములుగా ఉంది. అయితే అది గ్ర‌హ శ‌క‌లం అని తెలుసు క‌నుక అత‌ను దాన్ని భ‌ద్ర ప‌రిచాడు. అది ఇంటి మీద ప‌డ‌గానే పెద్ద ఎత్తున శ‌బ్దం వ‌చ్చింది. వెంట‌నే వెళ్లి చూసే సరికి పైకప్పు కొద్దిగా ధ్వంసం అయ్యింది. అయితే దాన్ని అత‌ను ట‌చ్ చేశాక కొద్దిగా వేడిగా అనిపించింది. అయిన‌ప్ప‌టికీ వెంట‌నే అత‌ను దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి భ‌ద్ర‌పరిచాడు.

కాగా ఆ వార్త తెలుసుకున్న అమెరికాకు చెందిన నిపుణుడు జేర్డ్ కొల్లిన్స్ ఆ గ్ర‌హ శ‌క‌లానికి భారీ మొత్తంలో చెల్లించి దాన్ని జోషువా నుంచి కొనుగోలు చేశాడు. అందుకు గాను జోషువాకు ఏకంగా 1.8 మిలియ‌న్ డాల‌ర్లు (దాదాపుగా రూ.13.37 కోట్లు) వ‌చ్చాయి. కాగా స‌ద‌రు గ్ర‌హ‌శ‌క‌లం సుమారుగా 450 కోట్ల సంవ‌త్స‌రాల కాలం నాటిద‌ని నిపుణులు గుర్తించారు. దానిపై వారు ప‌రిశోధ‌న‌లు చేయ‌నున్నారు. ఏది ఏమైనా.. ఆకాశం నుంచి వ‌చ్చిన అదృష్టం అత‌న్ని రాత్రి రాత్రికే కోటీశ్వ‌రున్ని చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news