ఓలా, ఉబర్ డ్రైవర్ రైడ్‌ ని క్యాన్సిల్ చేస్తే… ఏం చెయ్యాలి..? ఇలా స్క్రీన్ షాట్ తీసి..?

-

ఒక్కొక్కసారి మనం ఎంతో వేగంగా బయటకి వెళ్లాల్సిన పనులు ఉంటాయి. టైం కి వెళ్లాలన్నా లేదంటే ఏదైనా ముఖ్యమైన పనులు వంటివి వున్నా స్పీడ్ గా వెళ్లేందుకు మనం ఓలా, ఉబర్ ని బుక్ చేసుకుంటాము టైంకి వచ్చేస్తాయి కదా అని ధీమాగా ఉంటాము. క్యాబ్ ని బుక్ చేసుకుని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వారి గమ్యస్థానాన్ని సులువుగా చేరుతున్నారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా ఓలా ఉబర్ కి సంబంధించి కంప్లైంట్ లు వస్తున్నాయి. ముఖ్యంగా రైడ్ క్యాన్సిల్ విషయంలో కంప్లైంట్ లు వస్తున్నాయి. ఇలాంటి కంప్లైంట్ లు వస్తే ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం.

డ్రైవర్లు రైడ్ ఎక్కువగా క్యాన్సల్ చేస్తూ ఉంటారు. క్యాన్సిల్ చేసినా పికప్ కి రాకపోయినా మనం ఈ విధంగా కంప్లైంట్ చేయొచ్చు. ఇలా మనం కంప్లైంట్ చేస్తే ఎలాంటి బాధలు ఉండవు క్యాబ్ క్యాన్సిల్ ని మనం చేయకూడదు. డ్రైవర్లు క్యాబ్ పిక్ చేసుకోవడానికి రానప్పుడు వాళ్లే రైడ్ క్యాన్సిల్ చేసినప్పుడు యాప్ లోకి వెళ్లి క్యాబ్ నెంబర్ కనపడే విధంగా మనం మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోవాలి. టైం లొకేషన్ ఇలాంటి డీటెయిల్స్ చెప్పి సిటీ ట్రాఫిక్ పోలీసులకి వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ట్విట్టర్ ద్వారా కూడా కంప్లైంట్ చేయడానికి అవుతుంది.

ఈ స్క్రీన్ షాట్ ని మీరు ట్రాఫిక్ పోలీసులకి పంపించాల్సి ఉంటుంది మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 178 ప్రకారమైతే ప్రైవేట్ క్యాబ్లు కనుక తప్పులు చేశారంటే 200 రూపాయలు ఆ క్యాబ్ యజమాని నుండి వసూలు చేస్తారు. ప్రభుత్వ బస్సులు కి 500 రూపాయలను జరిమానా విధిస్తారు. క్యాబ్ డ్రైవర్ కి సాయంత్రం లోగా అగ్రికెటర్ నుండి ఆ రోజు రైడ్ల డబ్బులు వెళ్లకపోతే అతడికి ఇబ్బందులు వస్తాయి ఆరోజు చివర్లోగా వచ్చేలా అగ్రికెటర్లు చర్యలు తీసుకోవాలి కొందరు డిజిటల్ పేమెంట్ చేస్తామని కస్టమర్లు అన్నప్పుడు రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. చివరి నిమిషంలో రైడ్ క్యాన్సిల్ చూస్తే ఇబ్బంది వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news