షాద్‌నగర్‌పై రేవంత్ ఫోకస్..కంచుకోట తిరిగి దక్కుతుందా?

-

హైదరాబాద్ శివారులో ఉండే షాద్‌నగర్ నియోజకవర్గంపై టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. 2009 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. అయితే ఈ సారైనా షాద్‌నగర్ లో సత్తా చాటాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. కంచుకోటని తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నారు.

వాస్తవానికి షాద్‌నగర్ కాంగ్రెస్ కంచుకోట. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంఛి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. 1952లో ఈ స్థానం ఏర్పడగా అప్పటినుంచి 1983 వరకు 7 సార్లు వరుసగా గెలిచింది. 1985లో టి‌డి‌పి గెలవగా, 1989లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. 1994లో టి‌డి‌పి గెలిచింది. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిచింది. అంటే 11 సార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది.  బి‌ఆర్‌ఎస్ నుంచి అంజయ్య యాదవ్ గెలుస్తూ వస్తున్నారు. అయితే సహజంగా రెండుసార్లు గెలవడం, అధికారంలో ఉండటంతో..కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది.

 

గత రెండు ఎన్నికల్లో సులువుగా గెలిచేశారు గాని..ఈ సారి అంజయ్య గెలవడం కాస్త టఫ్. షాద్‌నగర్ లో ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక్కడ బి‌జే‌పి కంటే ప్రభావం కాస్త ఉంది. కానీ గెలిచెంత బలం బి‌జే‌పికి లేదు. బి‌జే‌పి ఓట్ల చీలిక ఎవరికి లాభం చేస్తుందో, నష్టం చేస్తుందో క్లారిటీ రావడం లేదు.

అయితే తమ బలం పెంచుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి.. షాద్‌నగర్ పై గట్టిగానే ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలోని పీర్లగూడ, గుర్రంపల్లి, షాద్‌నగర్‌, చిన్న ఉమ్మెంత్యాల గ్రామాలకు చెందిన వివిధ పార్టీల మైనారిటీ నాయకులు, కార్యకర్తలు రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ షాద్‌నగర్ లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఏదేమైనా ఈ సారి షాద్‌నగర్ లో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news