ఓరినాయ‌నో.. ఆ కిడ్స్ ఛాన‌ల్ కు కోటిమంది స‌బ్ స్క్రైబ‌ర్లా..

-

ప్రజెంట్ డిజిటల్ వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆన్ లైన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో జనాలు యూట్యూబ్, ఓటీటీల్లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేసినట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే బోలెడన్ని యూట్యూబ్ చానల్స్ పుట్టుకొచ్చాయి. దాదాపుగా డిజిటల్ అవేర్‌నెస్ ఉన్న వారందరూ యూట్యూబర్స్‌గా మారిపోయారు. తమవద్ద ఉన్న కంటెంట్‌ను వీడియో లేదా ఆడియో రూపంలో తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.

 Aayu and Pihu Show | ఆయు అండ్‌ పిహు షో
Aayu and Pihu Show | ఆయు అండ్‌ పిహు షో

అయితే, ఈ క్రమంలో పిల్లల కోసం వచ్చిన యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. కానీ, అందులో ఏ ఒక్కటి కూడా లక్ష మంది సబ్‌స్క్రైబర్లను పొందలేకపోయింది. కాగా, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ చిల్డ్రన్స్ యూట్యూబ్ చానల్ మాత్రం ఏకంగా కోటి మంది సబ్‌స్క్రైబర్స్‌తో దూసుకుపోతున్నది. అది ఎలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

రాజస్థాన్‌లోని కోటా సిటీకి చెందిన పియూష్, రుచి కల్రా దంపతులకు ఇద్దరు పిల్లలు పిహు, ఆయుష్‌. ఆయు‌ష్‌కు మూడున్నర ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి ఆన్‌లైన్‌లో చూసే అన్‌ బాక్సింగ్, రివ్యూ వీడియోలను ఆసక్తిగా గమనించేవాడు. ప్రతీ రోజు తను చూసే వీడియోలను ఆయు ఇష్టపడుతుండటంతో పిల్లలకు సంబంధించిన వీడియోలు ఏవైనా చూపించాలని తండ్రి పియూష్‌కు అనిపించింది. ఈ క్రమంలోనే ఆయు, పిహుకు మరిన్ని విషయాలు నేర్పాలనుకున్నారు పియూష్, రుచికల్రా. అలా ‘ఆయు అండ్‌ పిహు షో’ పేరిట యూట్యూబ్‌ చానల్ స్టార్ట్ చేశారు.

ఈ చానల్‌లో ఆయు, పిహు చిల్డ్రన్స్‌ మెచ్చే షార్ట్ స్టోరీస్, పోటీలు, నీతి కథలు ఇతర విషయాలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేయడం షురూ చేశారు. పిల్లలతో ప్రారంభించిన చానల్‌ అయినప్పటికీ మెల్లమెల్లగా ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దేందుకు లైటింగ్, కెమెరా, హై ఎండ్‌ గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌ను ఏర్పాటు చేసి, పిల్లలు కంటెంట్‌ను క్రియేట్‌ చేశారు పియూష్, రుచి. ఇలా యూనిక్ ప్లస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తుండటంతో మెల్లమెల్లగా వ్యూయర్స్ సంఖ్య పెరిగింది. ఫలితంగా సబ్‌స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు. క్రమంగా కోటి మంది వరకు సబ్‌స్క్రైబర్స్ పెరగడం చూసి పియూష్ దంపతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తంగా కిడ్స్ యూ ట్యూబ్ చానల్స్‌లో ప్రజెంట్ ఈ చానల్ దూసుకుపోతున్నది.

 

Read more RELATED
Recommended to you

Latest news