అరచేతిలో పంచభూతాలు.. అందుకే అన్నం చేత్తోనే తినాలి..!!

-

టైటిట్‌ చూసి ఆశ్చర్యపోతున్నారా..? పంచభూతాలు ఏంటి అరచేతిలో ఉండటం ఏంటి.. అసలు మానవశరీరం.. ఒక గొప్ప నిర్మాణం.. మనకు మన శరీరం గురించి పెద్దగా తెలియదు.. ఏదో పైకి పర్య్ఫూమ్‌ కొట్టేసుకుంటున్నాం అనుకుంటారు..తల నుంచి కాలి వేళ్ల వరకూ ప్రతి అయయవానికి గొప్ప శక్తి ఉంది. నాలుక ప్రేమేయం లేకుండా ఉచ్చరించే మంత్రం ఓం కు ఎంత శక్తి ఉందో. మీరు శరీరంలో అరచేతులకు కూడా అంతే శక్తి ఉంది. సినిమాల్లో హీరోయిన్‌ చేయి తగిలితే కరెంట్‌ షాక్‌ కొట్టినట్లు చూపిస్తారు.. అది కల్పితమే అయి ఉండొచ్చు.. కానీ అంత శక్తి చేతివేళ్లకు ఉంది. ఏ వేలు దేనికి నిదర్శనమో చూద్దామా..!

బొటనవేలు – అగ్నితత్వం
చూపుడు వేలు – వాయుతత్వం
మధ్యవేలు – ఆకాశ తత్వం
ఉంగరపు వేలు – భూమి
చిటికెన వేలు – జలతత్వం

ఈ ఐదువేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు చేరుతుంది. అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. చేతితో అన్నం తినమని చెప్పేది అందుకే. చేతిని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి. తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గిపోతాయి. ఇప్పుడు స్పూన్లతో తినడం ఓ ఫ్యాషన్ అయిపోయింది..

మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. చేతితో కలం పట్టుకుంటే రాయాలని అనిపిస్తుంది..కర్ర పట్టుకుంటే ఎవరినైనా కొట్టాలని అనిపిస్తుంది. చాకు పట్టుకుంటే ఏదో ఒకటి కోయాలి అనిపిస్తుంది.. చివరికి కూరగాయలకు గాట్లైన పెట్టితీరుతారు. ఇలా చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజగుణాన్ని చేతులు గ్రహించి ఆ దిశగా మనల్ని ప్రేరేపిస్తాయి. మీరు ఇలా ఫీల్‌ అయ్యే ఉంటారు కదా..!

ఆశీర్వచనం వెనుకున్న ఆంతర్యం
పెద్దల ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కిందకు వంగి వారి పాదాలకు నమస్కరిస్తే…వారు చేతిని తలపై పెట్టి ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు. పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు తల మీద పడేసరికి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే పంచభూతాల సాక్షిగా దీవించినట్టు అర్థం.

దేవుడికి చేసే కైంకర్యాలు..
ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా గమనిస్తే..దేవుడికి మొత్తం కైంకర్యాలన్నీ చేత్తోనే చేస్తారు. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం సమర్పించేటప్పుడు గమనిస్తే చేతులు తిప్పుతారు. స్వామివారికి ప్రత్యేక పూజల సమయంలో వేళ్లతో కొన్ని ముద్రలు పెడతారు. అంతేందుకు భరతనాట్యం, కూచిపూడి లాంటి నాట్యాల్లో కూడా ముద్రలకి ప్రత్యేక స్థానం ఉంది. యోగా, ధ్యానం సమయంలోనూ చేతి వేళ్లతో వివిధ రకాల ముద్రలు వేస్తారు..

చివరికి జీవితం ఎలా ఉంటుందో చెప్పే రేఖలు కూడా మన అరచేతిలోనే ఉంటాయి. అందుకే హస్తసాముద్రికంలో భాగంగా చేతి రేఖలని చూసి జాతకం చెపుతారు. అందుకే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది అంటారు.. ఇలా పంచాభూతలను చేతిలో నిక్షిప్తం చేసిన దేవుడికి చేతులెత్తి నమస్కరించాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news