వైరల్ వీడియో: కరోనా వల్ల టూత్ పిక్స్ దిక్కవుతున్నాయి!

-

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఎవరికీ వారు తమ జాగ్రత్తలు తామే తీసుకుంటూ కరోనా కు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దేన్నీ ముట్టుకోవాలి అన్నా కూడా ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి నెలకొంటుంది. దీనితో చివరికి లిఫ్ట్ బటన్ ముట్టుకోవాలన్నా కూడా భయపడిపోతున్నారు. అందుకే లిఫ్ట్ బటన్ నొక్కడం కోసం వెరైటీ గా టూత్ పిక్స్ ని ఉపయోగిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ పాటిస్తున్నారు. ఈ వైరస్ ఒకరిద్వారా మరొకరికి చాలా ఈజీ గా వైరస్ పాకుతుండడం తో అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలా లిఫ్ట్ బటన్ నొక్కడం కోసం చేతి వేళ్లు బదులు టూత్ పిక్స్ ను వాడుతున్నారు. ముంబాయి లోని నపియన్ సి రోడ్ లో గల కోపరేటివ్ సొసైటీ టైటాన్ లోని ఒక అపార్ట్ మెంట్ లో కూడా ప్రజలు ఇదే పద్దతి పాటిస్తున్నారు. కరోనా బాధితులు ఎక్కడ లిఫ్ట్ బటన్ లను నొక్కుతారో అన్న భయంతో ఈ టూత్ పిక్స్ పద్దతిని ఫాలో అవుతున్నారు. వీటిని ఎలా ఉపయోగించాలో తెలుపుతూ ఒక సూచనా పత్రం కూడా ఆ పక్కనే ఏర్పాటు చేశారు. నోయిడా లోని ఒక అపార్ట్మెంట్ లో కూడా ఇదే పద్దతి ఫాలో అవ్వడం విశేషం.

మొత్తానికి ఈ టూత్ పిక్ లిఫ్ట్ బటన్ ప్రెసింగ్ వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ కరోనా ప్రభావం తో ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు పైగా మరణాలు సంభవించగా, 2 లక్షలకుపైగా నే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. చైనా లో మొదటిసారిగా ప్రబలిన ఈ కరోనా ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news