లోక్ సభ ఎన్నికలు.. ఆ ఎంపీ అభ్యర్థి ఆస్తి రూ.1800

సిద్ధి నుంచి పోటీ చేస్తున్న లలన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద 1823 రూపాయలు మాత్రమే ఉన్నట్టు ప్రకటించాడు. అంటే ఆయన ఆస్తి 1823 రూపాయలే.

సాధారణంగా వార్డు మెంబర్‌గా పోటీ చేయాలంటేనే లక్షలు ఖర్చు పెట్టాలి. అటువంటిది పార్లమెంట్‌లో గళమెత్తాల్సిన మెంబర్ ఇంకెంత ఖర్చు పెట్టాలి. కోట్లే.. అక్కడి నుంచి తగ్గేది లేదు. అలా అయితేనే ఎంపీ అయినా.. ఇంకేదైనా గెలిచేది. లేదంటే తడిగుడ్డ వేసుకొని కూర్చోవడమే.

poor mp candidates contesting in lok sabha elections

కానీ.. రూపాయి లేకున్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని నిరూపించారు కొందరు అభ్యర్థులు. అవును.. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వాళ్ల దగ్గర కోట్లకు కోట్ల కట్టలు లేవు. కానీ.. వాళ్లు మాత్రం ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వాళ్లే మధ్యప్రదేశ్‌లోని సిద్ధి లోక్ సభ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్లు. నామినేషన్ వేసినప్పుడు వాళ్ల అఫిడవిట్ చూసి ఎన్నికల అధికారులే షాక్ అయ్యారు. ఎందుకంటే.. వాళ్లు కోటీశ్వరులు కాదు.. లక్షాధికారులు అంతకన్నా కాదు.

సిద్ధి నుంచి పోటీ చేస్తున్న లలన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద 1823 రూపాయలు మాత్రమే ఉన్నట్టు ప్రకటించాడు. అంటే ఆయన ఆస్తి 1823 రూపాయలే. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రామ్ సహాయ్ అనే వ్యక్తి తనకు రూ.6134 విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపాడు. జబల్ పూర్ నుంచి పోటీ చేస్తున్న ధనుక్ అనే వ్యక్తి.. తన ఆస్తులు 10,300 అని తెలిపాడు.