ప్రియాంకా చోప్రా జై హింద్ అనడం త‌ప్ప‌ట‌.. పాకిస్థాన్ పిచ్చి పీక్స్‌..!

ప్ర‌పంచ శాంతిని కోరుకునే అలాంటి సంస్థకు గుడ్ విల్ అంబాసిడ‌ర్‌గా ఉన్న ప్రియాంక ఇలాంటి విష‌యాల‌పై త‌ట‌స్థంగా ఉండాలి గానీ ఇలా ఒక దేశానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని పాకిస్థాన్ ప్ర‌శ్నిస్తోంది.

ప్ర‌ముఖ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా గ‌డుపుతోంది. అయితే ప్ర‌స్తుతం ఆమెకు కొత్త క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయి. ఇటీవ‌లే భార‌త వైమానిక ద‌ళం పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఉగ్ర‌వాదుల శిబిరాల‌ను ధ్వంసం చేసి పుల్వామా దాడుల‌కు ప్ర‌తీకారం తీర్చుకున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ ఆర్మీని మెచ్చుకుంటూ ప్రియాంక చోప్రా.. జైహింద్‌.. అని ట్వీట్ చేసింది. దీంతో ప్రియాంక అలా ఎలా పోస్టు పెడుతుంది.. అంటూ పాకిస్థాన్ వితండ వాదం చేస్తోంది.

ప్రియాంక చోప్రా UNICEF (యూనిసెఫ్) సంస్థ‌కు గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే ప్ర‌పంచ శాంతిని కోరుకునే అలాంటి సంస్థకు గుడ్ విల్ అంబాసిడ‌ర్‌గా ఉన్న ప్రియాంక ఇలాంటి విష‌యాల‌పై త‌ట‌స్థంగా ఉండాలి గానీ ఇలా ఒక దేశానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని పాకిస్థాన్ ప్ర‌శ్నిస్తోంది. అందులో భాగంగానే ఆ దేశ ప్ర‌భుత్వం ఇప్పుడు ప్రియాంక చోప్రాపై ఆన్‌లైన్ పిటిష‌న్ వేసింది. యునిసెఫ్ అంబాసిడ‌ర్ ప‌ద‌వి నుంచి ఆమెను తొల‌గించాల‌ని పాకిస్థానీయులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా ప్రియాంక చోప్రా పాకిస్థాన్ చేస్తున్న డిమాండ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అయితే స్పందించ‌లేదు. కానీ పాకిస్థాన్ డిమాండ్‌కు త‌లొగ్గి ఆమెను ఆ ప‌ద‌వి నుంచి తీసేస్తారా, లేదా అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. కాగా వయ‌స్సులో త‌న‌కంటే 11 ఏళ్లు చిన్న‌వాడైన నిక్ జోన‌స్‌ను పెళ్లాడిన ప్రియాంక 2017లో బే వాచ్ సినిమాతోపాటు గ‌తేడాది క్వాంటికో అనే టీవీ సిరీస్ చేశాక ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాలేవీ ఒప్పుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆమె మరో రెండు హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఇంత‌లో ఈ వివాదం చెల‌రేగింది. మ‌రి ఇది చివ‌ర‌కు ఏమ‌వుతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!