గట్టిగా కౌగిలించుకుంటే 7300 రూపాయలు.. అమెరికా లో సరికొత్త వ్యాపారం..

-

కరోనా వచ్చాక ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఎవ్వరూ లేక అనాధలైన వాళ్ళు ఎంతో మంది. తమ బాధ చెప్పుకోవడానికి కూడా మనుషులు లేకుండా పోయింది. ఎవరి బాధ వారికే అన్నట్లుగా ప్రపంచం సాగుతుంది. ఇదంతా కరోనా మార్చేసింది. ఐతే ఇలాంటి పరిస్థితుల్లో కౌగిలింతల వ్యాపారం పెద్ద ఎత్తున నడుస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. కౌగిలింత కోసం డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.

 వ్యాపారం

పరిస్థితులు బాగా లేక ఇబ్బందులు ఎదురైనపుడు తల వాల్చడానికి ఒక భుజం, ఆప్యాయంగా కౌగిలించుకోవడానికి ఒక మనిషి కావాలనుకోవడం సహజమే. ప్రస్తుతం అలాంటి మనుషులు కూడా దొరకడం లేదు. దాంతో వృత్తిపరంగా కౌగిలించుకునే వాళ్ళు పెరుగుతున్నారు. బాధల్లో ఉన్న వ్యక్తులకు కాసింత ఉపశమనం అందించడానికి కౌగిలింతలు ఇస్తున్నారు. ఇందులో శృంగారపరమైన సంబంధాలకు తావు లేదు.

అమెరికాకి చెందిన కీలీ షౌప్ అనే మహిళ కౌగిలింతల వ్యాపారంలో గంటకి 7300రూపాయలు ఛార్జ్ చేస్తుంది. కీలీ షౌప్ తన కాంట్రాక్టులో కఠినంగా ఉంటుంది. అయినా కూడా కస్టమర్ల నుండి వింత వింత అభ్యర్థనలు వస్తాయని తెలిపింది. చికాగోకి చెందిన కీలీ వద్దకి వచ్చే కస్టమర్లు, దీర్ఘకాల ఇబ్బందులతో మనో వ్యాధులతో బాధపడుతూ ఉంటారని, చాలా మందికి కనీసం తోడు కూడా లేని వాళ్ళూ ఉంటారని తెలిపింది. ఐతే చాలా తక్కువ మంది మాత్రమే శృంగారం గురించి అభ్యర్థనలు ముందు ఉంచుతారని, అలాంటి వాటికి తాము ఒప్పుకోమని చెప్పింది.

ఎక్కువ శాతం తమ పక్కన కూర్చోబెట్టుకుని పుస్తకం చదవమంటారని, అలాగే తమతో గొడవ పెట్టుకోవడం (గిల్లికజ్జాలు) సరదాగా ఉంటుందని చెబుతుంటారని పేర్కొంది. మొత్తానికి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనుబంధాలను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news