పూర్ చిల్డ్రన్స్‌కు ‘రన్నింగ్ స్కూల్’.. ఎక్కడో మీకు తెలుసా?

-

కొవిడ్ కట్డికి విధించిన లాక్‌డౌన్ నుంచి మొదలుకుని నేటి వరకు స్కూల్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కాలంలో స్కూల్స్ ఓపెన్ అయినప్పటికీ క్లాసెస్ కండక్ట్ చేయడం లేదు. చిల్డ్రన్స్ ఇంకా పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు. ఇక ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో పేద పిల్లల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్నం ప్రయోగం చేస్తోంది. ఆ సంస్థ పేరు ఏంటి? ఇంతకీ సంస్థ పిల్లల కోసంఏం చేస్తోంది? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

భారతదేశ రాజధాని ఢిల్లీలోని మురికి వాడల్లో ఉండే పేద పిల్లల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ రన్నింగ్ స్కూల్ ఏర్పాటు చేసింది. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టి మరి పాఠాలు చెప్తున్నారు. ఇందుకుగాను వీధుల్లోకి వెళ్లి మరి బస్సుల్లో పిల్లలను ఎక్కించుకుని పాఠాలు చెప్తోంది సదరు స్వచ్ఛంద సంస్థ. ఈ క్రమంలో మురికివాడ పిల్లలకు చదువులు చెప్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ప్రతినిధులను మానవ హక్కుల కార్యకర్తలు అభినందిస్తున్నారు. ఈ సంస్థ పేరు ‘తేజస్ ఆసియా’. స్కూల్స్ లేని ప్రాంతాల్లోని పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ‘హోప్ బస్సు’లు ప్రారంభించి వాటిల్లో లెస్సన్స్ చెప్తున్నారు. ఇక పిల్లలకు బస్సు ఎక్కడమంటే ఎలాగూ ఇష్టం కాబట్టి వారిని బస్సుల్లో ఎక్కించుకోవడం ఈజీ అవుతుంది. ఈ క్రమంలోనే బస్సులోనే టీచర్స్ వారికి పాఠాలు బోధిస్తున్నారు. తేజస్ ఆసియా’ సంస్థ ఏడేళ్ల కిందటే ఈ కమ్యూనిటీ స్కూల్‌ని ప్రారంభించగా, టీచర్స్‌ను తీసుకొచ్చి మరి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఈ సంస్థ తరఫున నాలుగు బస్సులు ఎనిమిది ప్రదేశాలకు వెళ్లి అక్కడ బస్సుల్లో పిల్లను ఎక్కించుకుని సుమారు రెండు గంటలపాటు పాఠాలు చెప్పి తర్వత వదిలేస్తారు. బస్సు రన్నింగ్‌లోనే టీచర్స్ పిల్లలకు పాఠాలు చెప్తుండగా, ‘రన్నింగ్ స్కూల్’ అనే పేరొచ్చింది. ఇలా మురికివాడల పిల్లలను జ్ఞానమార్గంలో నడిపించేందుకుగాను తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు సంస్థ ప్రతినిధులు.

Read more RELATED
Recommended to you

Latest news