సమంత, గంగవ్వ విలేజ్ డ్యాన్స్.. వైరల్ వీడియో

-

సాధారణంగా సినిమా సెలబ్రిటీలను ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంచెం పద్ధతిగా ప్రశ్నలు అడుగుతూ.. ఎక్కువగా వ్యక్తిగత విషయాల జోలికి పోరు. కానీ.. గంగవ్వ మాత్రం సమంతను చాలా సూటిగా ప్రశ్నలు వేసి ముప్పుతిప్పలు పెట్టింది.

సమంత అక్కినేని ప్రస్తుతం ఓబేబీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సందర్భంగా మైవిలేజ్‌షో యూట్యూబ్ ఫేమ్ గంగవ్వ.. సమంత, నందినిరెడ్డితో కలిసి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఆద్యంతం నవ్వులు పూయించింది.

సాధారణంగా సినిమా సెలబ్రిటీలను ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంచెం పద్ధతిగా ప్రశ్నలు అడుగుతూ.. ఎక్కువగా వ్యక్తిగత విషయాల జోలికి పోరు. కానీ.. గంగవ్వ మాత్రం సమంతను చాలా సూటిగా ప్రశ్నలు వేసి ముప్పుతిప్పలు పెట్టింది. సమంత వాటికి సమాధానాలు చెప్పడానికి కాస్త దడుసుకుందనే చెప్పాలి. చివర్లో ఇంటర్వ్యూ అంతా అయిపోయాక సమంత, గంగవ్వ ఇద్దరు కలిసి విలేజ్ డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news