పర్ఫ్యూమ్స్: మానసిక ఆరోగ్యానికి మేలు చేసే సువాసనల గురించి మీకు తెలుసా..?

-

మీరెప్పుడైనా ఆందోళనకి గురై ఆలోచన ఆగిపోయి ఇబ్బంది పడుతుంటే బ్యాగులోంచి పర్ఫ్యూమ్ తీసుకుని ఒక్కసారి వాసన చూడండి. అది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని శాస్త్రజ్ఞానం చెబుతుంది. మహమ్మారి కారణంగా మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఐతే చాలామందికి తెలియదు. మనసుకి నచ్చే వాసన మానసిక ఆరోగ్యానికి మేలు కలిగిస్తుందని.

మెదడులోని ఘ్రాణ శక్తికి సంబంధించిన వాటిని మేల్కోలిపి నచ్చిన వాసన నాసికని చేరినపుడు దాని తాలూకు పాత జ్ఞాపకాలని గుర్తుకు తెస్తుంది. ఈ విషయమై మరింత వివరించిన శీతల్ దేశాయ్ మాట్లాడుతూ, వాసనలు మానసికంగానే కాదు శారీరకంగానూ మేలు చేస్తాయని అన్నారు.

వాసనలు మనసుపై చూపే ప్రభావాన్ని అరోమాకాలజీ అంటారు. అరోమా థెరపీకి దీనికి చాలా తేడా ఉందని వెల్లడి చేసారు. అరోమాకాలజీలో ఒక వాసన పీల్చినపుడు దాని తాలూకు పాత జ్ఞాపకాలని గుర్తుకు తెస్తుంది. అంతేకాదు దీనిలో విభిన్నమైన సువాసనలు మనసు ప్రతిస్పందన విభిన్నంగా ఉంటుంది. ఒక్కోసారి వాసనని బట్టి ప్రతికూలంగా ఉండే అవకాశమూ ఉంది.

ఒక సువాసన వ్యక్తిని, పరిస్థితిని గుర్తుకు తెస్తుంది. చిన్నపిల్లల నుండి వచ్చే సువాసన చాలా సంతోషకరమైనది. నాన్న నుండి వచ్చే వాసన మీ భద్రతని తెలుపుతుంది. అప్పుడే బేకరీలో బిస్కట్ల నుండి వచ్చే సౌకర్యవంతంగా ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చాలామంది సైనికులు తమ వాళ్ళ నుండి కర్ఛీఫ్ లను తీసుకున్నారని శీతల్ దేశాఉ వెల్లడి చేసింది.

కొన్ని ఆహారాల నుండి వచ్చే వాసనలు సౌకర్యవంతంగా మారుస్తాయి. ఉదాహరణకి వెనీలా నుండీ వచ్చే సువాసన అలాంటిదే. ఇంకా కాఫీ నుండి వచ్చేది కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news