మీరు చదివింది నిజమే.. ఇదంతా సెల్ఫీలు, స్మార్ట్‌ఫోన్ల యుగం కదా. ఈ జనరేషనే వేరు. ఎల్‌కేజీ, యూకేజీ చదివే పిల్లలను అడిగిన సెల్ఫీ అంటే ఏంటో చెప్పేస్తారు. చెప్పడం ఏం ఖర్మ.. సెల్ఫీ దిగి మరి చూపిస్తారు. ఇదేమన్నా మామూలు జనరేషనా? ఇప్పుడు మీరు పైన చేస్తున్న ఫోటో కూడా సెల్ఫీయే. కాకపోతే వాళ్ల దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు. అందుకే… తమ దగ్గర ఖరీదైన ఫోన్ లేకున్నా.. డబ్బు లేకున్నా.. చెప్పుతో సెల్ఫీ తీసుకుంటూ చిరునవ్వు చిందించారు. వాళ్ల చిరునవ్వు చూడండి.. ఎంత సహజంగా ఉంది. లక్షలు పోసినా దొరకదు అంత సహజమైన చిరునవ్వు. మనం లక్షల రూపాయల ఖరీదైన ఫోన్ తీసుకొని.. సెల్ఫీ దిగినా.. అంత స్వచ్ఛమైన చిరునువ్వును చిందించగలమా? ఏమో డౌటే?
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. సెలబ్రిటీలు కూడా ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. అయితే.. బిగ్‌బీ అమితాబ్‌కు ఓ డౌట్ వచ్చింది. ఇది నిజమైన ఫోటోయేనా? లేక ఫోటోషాప్ ఇమేజా? అని డౌట్ వచ్చింది. ఆ డౌట్‌ను ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు అమితాబ్. అయితే.. అమితాబ్ సందేహాన్ని నెటిజన్లు వెంటనే తీర్చేశారు. అయ్యో.. సార్.. అది నిజంగా నిజమైన ఫోటోయే. మీకు అందులో ఎటువంటి అనుమానం లేదు. కావాలంటే చూడండి. సెల్ఫీ దిగుతున్న పిల్లల్లో ఓ పిల్లాడికి ఒకటే చెప్పు ఉంది. అది కూడా ఎడమ చెప్పు. సేమ్ అదే చెప్పు కుడికాలుది సెల్ఫీ తీస్తున్న చిన్నారి చేతికి ఉంది.. అంటూ ఆధారాలు కూడా చూపించారు కొంతమంది. మరికొందరు మాత్రం అవును సార్.. ఇది ఫేక్ ఇమేజ్‌లా ఉంది.. అంటూ అమితాబ్ డౌట్‌ను ఇంకాస్త పెంచారు. అలా ఈ ఫోటో ఇంకాస్త వైరల్‌గా మారడమే కాదు.. సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
.. with due respect and apology .. i feel this is photoshopped .. notice that the hand that holds the chappal is different than the rest of his body in size .. to his other hand by his side !!
— Amitabh Bachchan (@SrBachchan) February 3, 2019
This is not Photoshop edit …
Very possible with close angle photo the hands looking bigger .
The other chappal is there too— Bhupen Sinha (@bksCG) February 4, 2019
Ya..sir ..right hand thumb is missing
— DR.MILIND ZADE (@DrMilindZade) February 3, 2019
I think it's not photoshopped. The hand is not as big as it seems to be, if you look closely. This is a distortion because of shooting from the short distance..
— Oxana Chernavskikh (@OxanaChernavski) February 3, 2019
Not photoshopped. One kid is wearing the other chappal.
And he is the only one who wears one. They show beautifully… happiness is not what you have, happiness is who you are ! pic.twitter.com/cDqN3Pe3Ye— Arpita ?? (@arpita_dg) February 4, 2019