శృంగారం: పురుషుల స్పర్శకు ఉప్పొంగే మహిళల శరీరంలోని సున్నిత ప్రదేశాలు

శృంగారంలో స్పర్శకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. స్పర్శ అనేది ఇరువురి మనసుల్లోని కోరికను బహిర్గతం చేస్తుంది. శృంగారానికి దారి తీసేది స్పర్శే. ఐతే మహిళల శరీరంలో కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉంటాయి. కోరికలను రెచ్చగొట్టే అతిసున్నిత భాగాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 

romance

జుట్టు

మీ భాగస్వామి ముంగురులను అటూ ఇటూ తిప్పుతూ ఆడుకోండి. ఆ ఫీలింగ్ మీ భాగస్వామికి మంచి అనుభూతిని కలిగిస్తుంది.

నడుము

వీపు భాగంలో నడుము మీద చేతులను పెట్టి ఆమెను పడనివ్వకుండా సపోర్టుగా నిలవడం. ఈ స్పర్శ తాలూకు జ్ఞానం నరాల తీవెలను మోగించి శరీరమంతా ప్రకంపనలు కలగజేస్తుంది. ఆ కంపనాల ధాటికి ఒక్కసారిగా తుళ్ళిపడతారు. అందుకే మీరు సపోర్టుగా ఉండాలి.

చెవి

చెవి ఎముక చాలా సున్నితమైనది. అందుకే అక్కడ చాలా సున్నితంగా పెదాలతో నిమరాలి. ఆ స్పర్శ వారికి మత్తును కలిగిస్తుంది. దాంతో మీ భాగస్వామికి ఉత్తేజం కలుగుతుంది.

మెడ

మీ భాగస్వామి మెడ మీద చిరు పెదాలతో ముద్దుకోవడం అమితమైన ఆనందాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతారు. శృంగారంలో మెడ భాగంలో స్పర్శించడం కీలకంగా ఉంటుంది. మీ భాగస్వామికి ఇది ఎక్కువ ఆనందం ఇవ్వవచ్చు.

మోకాళ్ళు

మోకాళ్ళపై వేళ్ళు ఆడిస్తూ అవతలి వారిలో చలనం కలిగించడం. మీ భాగస్వామిలో ఉన్న కోరికలను నిద్రలేపడానికి ఇది బాగా పనిచేస్తుంది.

పిరుదులు

సున్నితంగా నిమురుతూ చేతులతో స్పర్శించడం వల్ల వారిలో అప్పటివరకూ ఉన్న సిగ్గులను దూరం చేయవచ్చు.

పాదాలు

పాదాలకు మసాజ్ చేస్తూ స్పర్శించడం వల్ల వాళ్ళలోని భయాన్ని పోగొట్టవచ్చు. దానివల్ల ఆ తర్వాత వచ్చే కార్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చేసుకోవచ్చు.