‘మధ్య వేలు చూపించడమే నేరం కాదు.. భావ వ్యక్తికరణలో భాగమే’.. తీర్చిచ్చిన కోర్టు

-

మన పెద్దోళ్లకు తెలియదేమో కానీ.. చదువుకున్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.. ఎవరికైనా మధ్య వేలు చూపించారంటే.. అది పెద్ద తప్పు, బూతు అని అర్థం.. అబ్బాయిలు అయితే… తెగ వాడేస్తారు.. ముఖ్యంగా మహిళలకు మధ్య వేలు చూపించారంటే.. మీ పని అయిపోయినట్లే.. మన దగ్గర కంటే.. పాశ్చత్య దేశాల్లో ఈ కల్చర్‌ బాగా ఉంటుంది. నిజానికి ఇలా వేలు చూపించడం నేరమే.. కానీ కెనడాలో ఒక కోర్టు ఈ కల్చర్‌పై సంచలన తీర్పు ఇచ్చింది.. అలా వేలు చూపించడం నేరమే కాదట..!అలా మధ్య వేలు చూపడం నేరమైతే కాదు అని కెనడాలోని ఒక కోర్టు తీర్పు వెలువరించింది. అలా మధ్య వేలు చూపడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేసింది. అది ఈ దేశ పౌరులకు దేవుడిచ్చిన హక్కు అని వ్యాఖ్యానించింది.

అసలు ఈ విషయం కోర్టు వరకూ ఎలా వెళ్లిందంటే..

కెనడాలోని ఒక నివాస సముదాయంలో ఇరుగుపొరుగు మధ్య వివాదం కోర్టుకు చేరింది. పక్కింట్లో ఉండే టీచర్ తనను బెదిరిస్తున్నాడని, మధ్య వేలు చూపుతూ అవమానిస్తున్నాడని, ప్రతీ రోజు వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆ టీచర్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణ చేశారు.. ఈ పంచాయితీ కోర్టు వరకూ వచ్చింది. విచారణ అనంతరం ఆ ఫిర్యాదును న్యాయమూర్తి కొట్టివేస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుగుపొరుగు మధ్య ఉండే చిల్లర గొడవ అని, దీన్ని ఇంత దూరం తీసుకువచ్చి అటు పోలీసుల, ఇటు కోర్టు సమయం వృధా చేశారని ఫిర్యాదు దారుపై మండిపడ్డారు. మధ్య వేలు చూపడం ద్వారా రక్షణ పొందడం కెనడా రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కులో భాగమని తేల్చి చెప్పారు.

మధ్య వేలు చూపడం నేరమేం కాదు.. ఇది క్లియర్’ అని ఆ న్యాయమూర్తి స్పష్టం చేశారు..‘అది మేనర్స్ కాకపోవచ్చు.. అది నాగరిక వ్యక్తీకరణ కాకపోవచ్చు.. అది మర్యాద కాకపోవచ్చు.. అది పెద్ద మనిషి తరహా కాకపోవచ్చు.. కానీ, అది నేరం కూడా కాదు అని చెప్పారు.. ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని నేరపూరిత చర్యగా పరిగణించలేమన్నారు.. అలాగే, ఆ ఫిర్యాదును కొట్టేశారు.

Read more RELATED
Recommended to you

Latest news